Neradigonda | అప్పుల బాధ తాళలేక రైతు ఆత్మహత్య

Neradigonda | అప్పుల బాధ తాళలేక రైతు ఆత్మహత్య

Neradigonda | నేరడిగొండ, ఆంధ్ర ప్రభ : అధిక వర్షాల కారణంగా పంట దిగుబడి రాకపోవడం, చేసిన అప్పులు తీర్చే మార్గం కానరాక మనస్థాపంతో ఓ రైతు ఆత్మహత్య చేసుకున్న ఘటన మండలంలో గురువారం చోటుచేసుకుంది. ఎస్సై ఇమ్రాన్‌ తెలిపిన వివరాల ప్రకారం మండలంలోని బుగ్గారం(బి) గ్రామానికి చెందిన జాదవ్‌ గంగాధర్‌ (58) వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్నాడు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు పంట తీవ్రంగా దెబ్బతిని దిగుబడి రాలేదు. దీంతో పంట పెట్టుబడి కోసం చేసిన రూ.5లక్షలు బ్యాంకు, ప్రైవేట్‌ అప్పులు ఎలా తీర్చాలో తెలియక గత కొద్ది రోజులుగా తీవ్ర ఆందోళన చెందుతున్నాడు. ఇదే విషయమై వారం రోజులుగా తన భార్య కమల వద్ద ఆవేదన వ్యక్తం చేసేవాడు. ఈ క్రమంలోనే మానసిక ఒత్తిడి తట్టుకోలేక మద్యానికి బానిసయ్యాడు. బుధవారం రాత్రి ఇంట్లో ఎవరూ లేని సమయంలో పురుగుల మందు తాగి ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డాడు. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే 108 వాహనంలో నిర్మల్‌ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ గంగాధర్‌ గురువారం మృతిచెందాడు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ఇమ్రాన్‌ తెలిపారు.

Leave a Reply