Narsingi | దొరికిన నగదు దక్కేలా చేసిన నిజాయితీ

Narsingi | దొరికిన నగదు దక్కేలా చేసిన నిజాయితీ
- నార్సింగిలో మణికంఠ యూత్, పోలీసుల సమన్వయంతో రూ.16,500 యజమానులకు అందజేత
Narsingi | నార్సింగి, ఆంధ్రప్రభ : నార్సింగి ఆదివారం నాడు గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద రూ.16,500 నగదు పాస్‌బుక్‌తో సహా దొరకగా, మణికంఠ యూత్ సభ్యులు వెంటనే పోలీసులకు అప్పగించారు. విచారణలో ఆ డబ్బులు వల్లూరు గ్రామానికి చెందిన వారివని నిర్ధారణ కావడంతో, యజమానులను పిలిపించి ఈరోజు ఎస్సై చేతుల మీదుగా నగదును మణికంఠ యూత్ సభ్యుల ద్వారా లబ్ధిదారులకు అందజేశారు. మణికంఠ యూత్ సభ్యులు ఆకుల భాను ప్రకాష్ గౌడ్, కుక్కల శ్రీకాంత్, కుక్కల సాయి తేజ, దుప్తల చందు, కళంచ సాయి, కాలేరు ప్రశాంత్, కొండేరి నిఖిల్, తదితరులు పాల్గొని నిజాయితీకి నిదర్శనంగా నిలిచారు. ప్రజలు వారి సేవాభావాన్ని అభినందించారు.
