Narsampeta | ఎన్నికల నియమాలను పాటించాలి

Narsampeta | ఎన్నికల నియమాలను పాటించాలి

Narsampeta | నర్సంపేట, ఆంధ్రప్రభ : నర్సంపేట మున్సిపాల్టీ ఎన్నికల కోడ్ అమలులో ఉందని, ప్రతీ ఒక్కరూ ఎన్నికల నియమాలను ఖచ్చితంగా పాటించాలని ఇన్స్పెక్టర్ ముష్క శ్రీనివాస్ సూచించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇతర పార్టీలను గాని, వ్యక్తులను గానీ కించపరిచే వాఖ్యలు చేయకూడదన్నారు. డబ్బు, మద్యం, బహుమతులు పంపిణీ చేయడం ఎన్నికల చట్టాల ప్రకారం తీవ్రమైన నేరమే అన్నారు. నిబంధనలు అతిక్రమించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామ న్నారు. ప్రజల శాంతి భద్రతలకు, ఎన్నికల నిర్వహణకు భంగం కలిగించే ఏ ప్రయత్నం చేసిన చట్టప్రకారం కఠినంగా వ్యవహరించ బడుతుందన్నారు. బెల్ట్ షాపులు నడిపినా, మాదకద్రవ్యాలు వినియోగించిన, అమ్మినా, అసాంఘిక కార్యకలాపాలు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని శ్రీనివాస్ హెచ్చరించారు.

Leave a Reply