KNR | కన్నుల పండువగా నరసింహుని తెప్పోత్సవం…

  • భక్త జనసంద్రంగా కోనేరు
  • మారు మ్రోగిన గోవిందా నామ స్మరణ
  • వేలాది గా తరలివచ్చిన భక్తులు

ధర్మపురి, ఆంధ్రప్రభ : జగిత్యాల జిల్లాలోని ప్రాచీన పుణ్యక్షేత్రమైన ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు గత ఐదు రోజులుగా అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో ముఖ్య ఘట్టమైన శ్రీ లక్ష్మీనరసింహస్వామి (యోగ)డోలోత్సవం, తెప్పోత్సవం శుక్రవారం కన్నుల పండుగగా జరిగింది.

సాయంత్రం వేళలో గోధూలి సమయాన స్వామివారిని అందంగా అలంకరించిన సేవ లపై ఆసీను లు చేసి మేళతాళాలతో భక్తజనం తోడురాగా స్థానిక (కోనేరు )బ్రహ్మ పుష్కరిణి తీసుకువచ్చి కోనేరులో గల హంస వాహనంపై స్వామివారిని ఐదు ప్రదక్షిణలు చేసి తెప్పోత్సవం నిర్వహించగా భక్తజనం స్వామివారి ని అనుసరిస్తూ గోవింద నామ స్మరణలతో స్వామివారలకు బుక గులాలు చల్లి మొక్కలు చెల్లించారు.

అనంతరం కోనేరు లో మధ్యగల భోగ మండపంలో స్వామివారిని అసిను లు చేసి డోల లూగించ డోలోత్సవం జరిపారు. స్వామి వారిని తిలకించేందుకు సుదూర ప్రాంతాల నుంచి వేలాదిగా భక్తజనం తరలివచ్చి ఉత్సవం అనంతరం స్వామివారిని బారులు తీరి డోలోత్సవ స్వామిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు.

డీఎస్పీ రఘుచందర్ నేతృత్వంలో సిఐ రాం నర్సింహారెడ్డి ఆధ్వర్యంలో సుమారు 200 ల మంది పోలీసుల తోఎస్ఐ లు ఉదయ్ కుమార్,శ్రీధర్ రెడ్డి, సతీష్, ఉమా సాగర్ లు భద్రత ఏర్పాటు చేశారు. ఆలయ చైర్మన్ జక్కు రవీందర్, ఆలయ కార్యనిర్వాహక అధికారి సంకటల శ్రీనివాస్ ఎప్పటికప్పుడు భక్తుల ఏర్పాట్లు పర్యవేక్షించారు.

ప్రభుత్వ విప్ ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్,స్వామివారి ని దర్శించి భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అధికారుల ను సమన్వయం చేసి ఏర్పాట్లు పర్యవేక్షణ చేశారు.

ఈ కార్యక్రమంలో నాయకులు సంఘనబట్ల దినేష్,వేముల రాజేశ్, బాధినేని రాజేందర్, చిపిరిశెట్టి రాజేశ్,బీఆర్ఎస్ నాయకులు ఎల్లాల శ్రీకాంత్ రెడ్డి, సంగి సత్తెమ్మ,ధర్మకర్తలు నేదునూరి శ్రీధర్, ఎదులపురం మహేందర్,రాపర్తి సాయి,స్తంభం కాడి గణేష్,గుడ్ల రవి,పవన్,గ్రామ పురప్రముఖులు,భక్తులు తదితరులు పాల్గొన్నారు.

ధర్మపురికి భక్తుల తాకిడి….

ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు గత ఐదు రోజులుగా అత్యంత వైభవంగా జరుగుతున్నాయి ఐదో రోజు స్వామివారిని దర్శించేందుకు సుదూర ప్రాంతాల నుంచి వేలాదిగా భక్తులు తరలివచ్చి పవిత్ర గోదావరి నదులు పుణ్యస్నాన ఆచరించి గోదావరి మాతను పూజించి అనంతరం ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంతో పాటు అన్ని అనుబంధాలయాల్లో వారు తీరి స్వామివారిని దర్శించుకొని స్వామివారికి పట్టణామాలు కోరవీసాలు మొక్కులు చెల్లించుకొని తలనీలాలు సమర్పించారు

భక్తులకు అన్నదానం….

ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి బ్రహ్మోత్సవాలకు తరలివచ్చిన వేలాది మంది భక్తులకు స్థానిక టీటీడీ కల్యాణ మండపంలో నిరంతరం అన్నదాన ప్రక్రియ కొనసాగుతుంది భక్తులకు అనుగుణంగా భోజనం ఏర్పాటు చేసి భక్తులకు అన్నదానం చేస్తున్నారు అన్నదానం చేసిన వ్యక్తులు ఆనందం వ్యక్తం చేశారు. శ్రీవల్లి సేవా సంస్థ సభ్యులు అన్నదాన మరియు భక్తుల క్యూ లైన్ లలో సేవా కార్యక్రమాలు నిర్వహించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *