Nalgonda | లైఫ్ స్టైల్ మార్చుకోవాల్సిందే

Nalgonda | లైఫ్ స్టైల్ మార్చుకోవాల్సిందే
Nalgonda | నల్గొండ, ఆంధ్ర ప్రభ : డయాబెటిస్ రాకుండా ఉండాలంటే ప్రతి ఒక్కరు లైఫ్ స్టైల్(Lifestyle) మార్చుకోవాల్సిందేనని డాక్టర్ మాతృనాయక్(Matrunayak) అన్నారు. ప్రపంచ మధుమోహ దినోత్సవం జిల్లా కేంద్రంలోని ఎన్జీ కళాశాలలో ఇంటర్నేషనల్ డయాబెటిస్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో వరల్డ్ డయాబెటిస్(World Diabetes) దినోత్సవం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఉచిత వైద్య శిబిరం నిర్వహించి షుగర్, బిపి, థైరాయిడ్ వంటి పరీక్షలు నిర్వహించి రోగులకు ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కళాశాలకు వాకింగ్‌కు వచ్చిన ప్రతి ఒక్కరికి డయాబెటిస్ పై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో విఠల్ హాస్పిటల్ డాక్టర్ విఠల్ బాబు(Vitthal Hospital Dr. Vitthal Babu), డాక్టర్ శ్రీనివాస్, డాక్టర్ వేణుగోపాలరావు, డాక్టర్ అనిల్ కుమార్, డాక్టర్ రవీందర్ రెడ్డి, డాక్టర్ వెంకటరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

