Mulugu | మీ బిడ్డల్ని ఆదరించి… గెలిపించండి!

Mulugu | మీ బిడ్డల్ని ఆదరించి… గెలిపించండి!
- 5వ వార్డును అభివృద్ధి చేసి చూపిస్తా
- 5వ వార్డు అభ్యర్థి గుగ్గిళ్ళ దివ్య సృజన్
Mulugu |ములుగు, ఆంధ్రప్రభ ప్రతినిధి : ములుగు మున్సిపాలిటీలో ఎన్నికల హడావిడి రోజురోజుకీ పెరుగుతోంది. ముఖ్యంగా 5వ వార్డులో పోటీ ఆసక్తికరంగా మారింది. ఈ వార్డులో అభ్యర్థిగా బరిలో ఉన్న గుగ్గిళ్ళ దివ్య సుజన్ ప్రజల మధ్యకు వెళ్లి… “నన్ను మీ బిడ్డలా ఆదరించి… గెలిపించండి… 5వ వార్డును అభివృద్ధి చేసి చూపిస్తా” అంటూ ప్రజలకు అభయ హస్తం ఇస్తున్నారు. ప్రచారం మొదలుపెట్టిన నాటి నుంచే ప్రజలతో నేరుగా మమేకమవుతున్నారు. కాలనీల్లో తిరుగుతూ తాగునీరు, డ్రైనేజీ, వీధి దీపాలు, రోడ్ల సమస్యలు అడిగి తెలుసుకుంటున్నారు. “ప్రజల సమస్యలు తెలుసుకోవడమే కాదు… వాటికి పరిష్కారం చూపించడమే నా లక్ష్యం” అని చెబుతున్నారు.ప్రత్యేకంగా మహిళలు, యువత నుంచి దివ్య సుజన్‌కు మంచి స్పందన కనిపిస్తోంది. “మహిళగా… వార్డు అభివృద్ధికి నిబద్ధతతో పనిచేస్తా. ప్రభుత్వం ఇచ్చే నిధులను పూర్తి స్థాయిలో వినియోగించి… 5వ వార్డును ఆదర్శంగా తీర్చిదిద్దుతా” అంటూ ఆమె చెబుతున్న మాటలు ప్రజల్లో నమ్మకం పెంచుతున్నాయి.ఎన్నికల్లో మాటలకే పరిమితం కాకుండా… గెలిచిన వెంటనే చేయబోయే పనులపై కూడా ఆమె స్పష్టమైన ప్రణాళికను ప్రకటిస్తున్నారు.
