దమ్మపేట పీహెచ్‌సీలో ఎమ్మెల్యే జారే ఆకస్మిక తనిఖీ

దమ్మపేట, ఆంధ్రప్రభ ; భద్రాద్రి కొత్తగూడెం జిల్లా , అశ్వారావుపేట నియోజక వర్గం ,దమ్మపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని శనివారం అశ్వారావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ముందస్తు సమాచారం లేకుండా ఆసుపత్రికి చేరుకున్న ఆయన అక్కడి పరిస్థితులను, రోగులకు అందుతున్న సేవలను పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆసుపత్రిలోని సిబ్బంది హాజరు పట్టికలను, రికార్డులను ఎమ్మెల్యే తనిఖీ చేశారు.అనంతరం ఆసుపత్రి వైద్యుడు డాక్టర్ మణిదీప్‌తో మాట్లాడుతూ ఆసుపత్రిలో ఏమైనా సమస్యలు ఉన్నాయా అని ఆరా తీశారు. ఆసుపత్రికి అవసరమైన మౌలిక సదుపాయాలు, ఇతర సామాగ్రి తదితర వివరాలతో ఒక నివేదికను అందజేయాలని ఎమ్మెల్యే సూచించారు.
