MLA Nayak | అన్నదాతకు అండగా..
MLA Nayak | మహబూబాబాద్ రూరల్, ఆంధ్రప్రభ – రైతు ఎండ అనక, వాన అనక, కష్టపడి పండించిన పంట, అమ్ముకోవడం కోసం ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వస్తే, కాంటాళ్లల్లో మోసం చేయకుండా ఉండాలని, మహబూబాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ భూక్య మురళి నాయక్ (MLA Dr. Bhukya Murali Nayak) అన్నారు. గురువారం మండలంలోని, కంబాలపల్లి, ముడుపుగల్, గ్రామాలలో మండల మహిళా సమైక్య, ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రైతులు, అధికారులు, మహిళా సంఘాల సభ్యులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.

