MLA GSR | క్రీడలతో మానసిక దృఢత్వం

MLA GSR | క్రీడలతో మానసిక దృఢత్వం
- క్రీడాపోటీలను ప్రారంభించిన ఎమ్మెల్యే జీఎస్సార్
MLA GSR | ఆంధ్రప్రభ ప్రతినిధి, భూపాలపల్లి : యువత శారీరకంగా, మానసికంగా దృఢంగా ఎదగాలంటే క్రీడలు ఎంతో అవసరమని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అన్నారు. ఈరోజు భూపాపల్లి జిల్లాలోని కొత్తపల్లిగోరి మండల కేంద్రంలోని స్థానిక హైస్కూల్ గ్రౌండ్‌లో వివిధ యూత్ అసోసియేషన్ల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న క్రికెట్, వాలీబాల్, షటిల్ క్రీడా పోటీలను ఎమ్మెల్యే ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ యువత శారీరకంగా, మానసికంగా దృఢంగా ఎదగాలంటే క్రీడలు ఎంతో అవసరమని అన్నారు. క్రీడల ద్వారా యువతలో క్రమశిక్షణ, ఐక్యత, నాయకత్వ లక్షణాలు అలవడతాయన్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతిభావంతులైన క్రీడాకారులను ప్రోత్సహించడమే సీఎం రేవంత్ రెడ్డి ప్రజా ప్రభుత్వ లక్ష్యం అన్నారు.
వివేకానంద ఆలోచనలను ఆదర్శంగా తీసుకోవాలి
యువత స్వామి వివేకానంద ఆలోచనలను ఆదర్శంగా తీసుకుని ఉన్నత లక్ష్యాలతో ముందుకు సాగాలని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు సూచించారు. స్వామి వివేకానంద 163వ జయంతి సందర్భంగా కొత్తపల్లిగోరి మండలంలో నిర్వహించిన జయంతి వేడుకల్లో ఎమ్మెల్యే పాల్గొని స్వామి వివేకానంద చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పలువురు క్రీడాకారులు, నాయకులు ఎమ్మెల్యేకు శాలువాలు కప్పి సన్మానం చేశారు.
