ఇందిరమ్మ ఇళ్ల పథకం నిరాశ్రయులకు నీడ

ఇందిరమ్మ ఇళ్ల పథకం నిరాశ్రయులకు నీడ
ఇందిరమ్మ ఇళ్ల పథకం నిరుపేదలకు వరం
పేద ప్రజల మొహంలో ఆనందం చూడడమే ప్రజా ప్రభుత్వ ద్యేయo
లపంగి నర్సింహా, వెన్నమనేని రవీందర్ రావు
ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపిన లబ్ధిదారుడు పాండు
మర్రిగూడ ,ఆంధ్రప్రభ: ఇందిరమ్మ ఇళ్ల పథకం రాష్ట్రంలోని ఇల్లు లేని నిరాశ్రయులకు నీడను కల్పిస్తుందని సర్పంచ్ లపంగి నర్సింహా అన్నారు. రాంరెడ్డిపల్లి గ్రామంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఇందిరమ్మ ఇంటి పథకంలో లబ్ధి పొంది సొంత ఇంటి నిర్మాణాన్ని పూర్తి చేసుకున్న లబ్ధిదారుడు రావుల పాండు ఇంటి నిర్మాణన్ని పూర్తి చేసుకోని గృహప్రవేశం చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి స్థానిక సర్పంచ్ లపంగి నరసింహ నాంపల్లి బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు వెన్నమనేని రవీందర్ రావుతో కలిసి ముఖ్య అతిథిగా హాజరై సొంత ఇంటి కల నెరవేర్చుకున్న రావుల పాండ్ కు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ గ్రామాల్లోని పేదలకు సంక్షేమ పథకాలను అమలుపరిచి వారి జీవన ప్రమాణాలు మెరుగు పడడానికి వారికి రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉండి భరోసాను కల్పిస్తుందని తెలిపారు.
ఇందిరమ్మ ఇళ్ల పథకం ఇండ్లు లేని నిరుపేదల పాలిట గొప్ప వరమని అన్నారు. పేద ప్రజల మొహంలో ఆనందం చూడడమే ప్రజా ప్రభుత్వ ద్యేయమని పేర్కొన్నారు. అనంతరం ఇందిరమ్మ ఇల్లు పొందిన లబ్ధిదారుడు రావుల పాండు మాట్లాడుతూ సొంతింటి కలను నెరవేర్చిన రాష్ట్ర ప్రభుత్వానికి, స్థానిక ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ శాఖ అధ్యక్షులు కారింగు నర్సింహా, నాయకులు వెన్నమనేని పాపారావు, రావుల రాములు, బీమనగోని యాదయ్య, ఎస్సీ సెల్ కన్వీనర్ సిరిపంగి శ్రీనివాస్, వార్డు సభ్యులు లపంగి మహేందర్, వల్లపు భాస్కర్, ప్రదీప్ రావు, శ్రీను, లోకేష్, గ్రామస్తులు పాల్గొన్నారు.
