Seethakka | మహిళలకు సీఎం రేవంత్ రెడ్డి పెద్దన్న…

Seethakka | మహిళలకు సీఎం రేవంత్ రెడ్డి పెద్దన్న…

మహిళ సంఘాలకు వ్యాపార అభివృద్ధికి వడ్డీలేని రుణాలు..
పంచాయతీ రాజ్ శాఖ మంత్రి దనసూరి అనసూయ సీతక్క..


Seethakka | రేగొండ, ఆంధ్రప్రభ : మహిళల అభ్యున్నతే తెలంగాణ ప్రభుత్వ లక్ష్యమని పంచాయతీరాజ్ మంత్రి (ధనసరి అనసూయ) సీతక్క (Seethakka) అన్నారు. వ్యాపార రంగంలో రాణించేలా వడ్డీ లేని రుణాలు అందజేస్తున్నట్లు తెలిపారు. భూపాలపల్లి నియోజకవర్గం కొత్తపల్లిగోరి మండల కేంద్రంలోని గవర్నమెంట్ హైస్కూల్ గ్రౌండ్ లో జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పంచాయతీ రాజ్ మంత్రి ధనసరి అనసూయ సీతక్క, భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు, జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మతో కలిసి పాల్గొన్నారు.

ఈసందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. కోటిమంది మహిళలను కోటీశ్వరులను చేయాలనే ధృడ సంకల్పంతో మహిళలకు అనేక కార్యక్రమాలను అమలు చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం (Free travel), అద్దె బస్సులకు యజమానులను చేయడం, వడ్ల కొనుగోలు కేంద్రాల నిర్వహణ లాంటి ఎన్నో కార్యక్రమాలను వారికి ఇస్తున్నట్లు తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ మాట్లాడుతూ… సీఎం రేవంత్ రెడ్డి ప్రజా ప్రభుత్వం మహిళల అభ్యున్నతికి కృషి చేస్తోందన్నారు. ఇందిరాగాంధీ చేసిన అభివృద్ధి బాటలో కాంగ్రెస్‌ ప్రభుత్వం నడుస్తుందని, కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలనేదే తమ ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. దేశ ప్రగతి, పేదల అభ్యున్నతి కోసం ప్రాణాలర్పించిన మ‌హ‌నీయురాలు ఇందిరాగాంధీ అని ఆయన కొనియాడారు.

ఆమె ప్రాణాల‌కు ముప్పు ఉంద‌ని తెలిసినా దేశ సమగ్రత, సమైక్యత కోసం కఠిన నిర్ణయాలు తీసుకున్నారని వెల్లడించారు. ఇందిర‌మ్మ పాల‌నే ఆద‌ర్శంగా పేద‌ల అభ్యున్నతి కోసం అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. జగ్గయ్యపేట (Jaggaiahpet) లో.. మండల పర్యటనలో ఉన్న ఎమ్మెల్యే జీఎస్సార్ జగ్గయ్యపేట గ్రామంలో పూర్తయిన అభివృద్ధి పనులను ప్రారంభించారు. రూ.20లక్షలతో రామగుండాలపల్లి రోడ్డులో కొత్తగా నిర్మించిన పంట పొలాలకు వెళ్లే ఆయకట్టు రోడ్డును ప్రారంభించారు. అనంతరం రూ.10 లక్షలతో నూతనంగా నిర్మించిన స్మశాన వాటికకు వెళ్ళే రోడ్డు ప్రారంభించారు. ఇటీవల కరెంట్ షాక్ కు గురై ఇంటి వద్ద చికిత్స పొందుతున్న కాంగ్రెస్ కార్యకర్త తనుగుల మల్లయ్యను ఎమ్మెల్యే పరామర్శించారు.

కొత్తపలిగొరి గ్రామంలో పీఏసీఎస్ (PACS) ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ.. రైతులు ఆరుగాలం కష్టపడి శ్రమించి పండించిన ప్రతి ధాన్యపు గింజను ప్రజా ప్రభుత్వం పూర్తిగా కొనుగోలు చేస్తుందని తెలిపారు. రైతులు నాణ్యమైన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చి, ప్రభుత్వం నిర్ణయించిన గిట్టుబాటు ధరలు పొందాలని రైతులను ఎమ్మెల్యే కోరారు. రైతుల సంక్షేమమే సీఎం రేవంత్ రెడ్డి ప్రజా ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, ఎవరూ ఇబ్బందులు పడకుండా ధాన్యం కొనుగోలు ప్రక్రియను పారదర్శకంగా జరపాలని సంబంధిత శాఖల అధికారులకు ఎమ్మెల్యే సూచించారు.

రేగొండ మండల కేంద్రంలోని గుడ్ లైఫ్ స్కూల్ గ్రౌండ్ లో జిల్లా గ్రామీణ అభివృద్ధి శాఖ వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు (MLA Gandra Satyanarayana Rao) హాజరై, మహిళలకు చీరలను పంపిణీ చేశారు. అనంతరం అక్కడ ఎమ్మెల్యే మాట్లాడుతూ… సీఎం రేవంత్ రెడ్డి ప్రజా ప్రభుత్వం మహిళల అభ్యున్నతికి కృషి చేస్తోందన్నారు. ఇందిరాగాంధీ చేసిన అభివృద్ధి బాటలో కాంగ్రెస్‌ ప్రభుత్వం నడుస్తుందని, కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలనేదే తమ ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే చెప్పారు.

కొత్తపల్లిగోరి అండ్ రేగొండ మండలాల్లోని వివిధ గ్రామాలకు చెందిన మొత్తం 28మంది సీఎంఆర్ఎఫ్ లబ్ధిదారులకు రూ.8,88,000 విలువైన చెక్కులను ఎమ్మెల్యే అందజేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పేదల ఆరోగ్యానికి ఆర్థిక భరోసా సీఎం సహాయనిధి (CM Relief Fund) అని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రజా ప్రభుత్వం బడుగు, బలహీన వర్గాల, పేదల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్.విజయలక్ష్మి,భూపాలపల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్. గుటోజు కిష్టయ్య, జిల్లా నాయకులు. నాయినేని సంపత్ రావు, నడిపెల్లి విజ్జన్ రావు, మోడెమ్ ఉమేష్ గౌడ్, సూరం వీరేందర్, మేకల భిక్షపతి,ఎర్రబెల్లి రవీందర్ రావు, నాయకులు. ఇప్పకాయల నర్సయ్య, పున్నం రవి, పత్తి ప్రభాకర్, మాటికే సంతోష్, ఏనుగు రవీందర్ రెడ్డి, మహమ్మద్ షాబీర్, దుగ్యాల రాజేశ్వరరావు,కాశెట్టి రాజయ్య, చిగురుమామిడి కుమారస్వామి, పాతపల్లి సంతోష్, మైస భిక్షపతి, గంగుల రమణారెడ్డి, సుధానబోయిన ఓం ప్రకాష్, మొట్టే కిరణ్, తోకల సురేందర్ రెడ్డి, పత్తి తిరుపతి, జోరు సుదర్శన్, పుట్ట రవి, జున్ను సురేష్,సబ్బిడి సురేందర్ రెడ్డి, నాంసాని రాంబాబు, క్యాతం సదయ్య, మొర్రి అశోక్, గంపల భాస్కర్, లెంకలపెల్లి రవి, పొనుగోటి వీరబ్రహ్మం, అమ్ముల రాజయ్య, నడిపెల్లి వెంకట్రావు, బోయిని కుమారస్వామి, బండి సాయిలు, ఆకుల మల్లయ్య, కోసరి నరేందర్, ఒడ్డల రాజు, అమ్ముల సదయ్య, బండి మల్లయ్య, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply