అధికారులతో మంత్రి అచ్చెనాయుడు

అధికారులతో మంత్రి అచ్చెనాయుడు

అమలాపురం, ఆంధ్రప్రభ : తుఫాన్లు వరదలు వంటి ప్రకృతి వైపరీత్యాలు సహజ సిద్ధంగా సంభవిస్తాయని వాటి వల్ల ప్రాణ ఆస్తి నష్టాలకు తావు లేకుండా ప్రజా ప్రతినిధులు, ప్రభుత్వ యం త్రాంగం సమన్వయంతో వ్యవహరించాలని జిల్లా ఇన్చార్జ్ వ్యవ సాయ సహకారం మార్కెటింగ్ శాఖ, డైరీ డెవలప్మెంట్(Diary Development) మత్స్యశాఖ మంత్రి కె అచ్చెన్న నాయు డు అన్నారు.

మంగళవారం స్థానిక కలెక్టరేట్ నందు ఆయన వివిధ శాఖల అధికారులతో మొంథా తుఫాన్ తీవ్రత,సహాయక చర్యలు, పునరావాస కేంద్రా ల నిర్వహణ రోడ్లు రాక పోకలు విద్యుత్ సరఫరా అంశాలపై ప్రత్యేక అధికారి విజయరామరాజు జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్(Collector R Mahesh Kumar) అధ్యక్షతన సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ జిల్లా యంత్రాంగం ఆస్తి ప్రాణ నష్టాలకు ఆస్కారం లేకుండా ముందస్తు జాగ్రత్త చర్యలను సహాయక చర్యలను వేగవంతం చేయాలని రాష్ట్ర ముఖ్య మంత్రి చంద్రబాబు నాయు డు సూచించారన్నారు.

జిల్లాలో ఇప్పటికే తాడిచెట్టు పడి ఒక మహిళ మరణిం చడం దురదృష్టకరమ న్నారు. ఇటువంటి సంఘ టనలు పునరావృతం కాకుండా ప్రజాప్రతినిధులు అధికారులు ప్రజలను అప్రమత్తం చేయాలని సూచించారు ప్రకృతి విప త్తుల పట్ల వెంటనే స్పం దించే క్షేత్రస్థాయిలో స్వయం గా పర్యవేక్షిస్తూ నష్టాలు తీవ్రతను తగ్గిం చడంలో ముఖ్య మంత్రి(Chief Minister) వర్యులు ఎంతో అనుభవం హుదూద్ వంటి పలు తుఫానుల ద్వారా గడిం చారన్నారు అదే స్ఫూర్తితో తుఫాన్ తీవ్రత వల్ల జరిగే నష్టాలను పూర్తిగా నివా రించి ప్రభుత్వానికి మంచి పేరు తేవాలన్నారు.

పూరి గుడిసెలు, పక్కా గృహాలు సముద్ర తీరానికి ఒక కిలోమీటర్ పరిధిలో నివాసముంటున్న వారం దరినీ పునరావాస కేంద్రా లకు తరలించాలన్నారు. చాలామంది ఇల్లు విడిచి బయటకు రావడానికి ఇష్టపడరని అయి నప్పటికీ వారి యోగక్షేమాలను కోరుతూ బలవంతం గా నైనా తరలించాలన్నారు మొంథా తుఫాను(Mondha Cyclone) నేటి (మంగళవారం) సాయంత్రం 5 గంటలు రాత్రి 10 గంటల మధ్య రాజోలు సమీప ప్రాంతంలో తీరని దాటే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ వెల్లడిం చినట్లు మంత తెలిపారు.

జిల్లా ప్రజానీ కానికి టైం టు టైం వరద హెచ్చరికల సమా చారాన్ని అందిస్తూ అప్రమత్తం చే యాలని అధి కారులను ఆదేశించారు. ఇప్పటికే ఈదురుగాలుల తీవ్రత క్రమంగా పెరుగు తోందని ప్రజలు అప్రమత్తం కావా లన్నారు. అందరినీ పునావాస్ కేంద్రాలకు తీసు కువచ్చి రేపు సాయంత్రం వరకు పునరావస కేంద్రాలలో ఆశ్రయం కల్పించి రాత్రి భోజనం అనంతరం తిరిగి ప్రభుత్వం ప్రకటించిన రూ. 3 వేల ఆర్థిక సహాయాన్ని, మత్స్యకార నిర్వాసితులకు ఉచితంగా 25 కేజీల బియ్యాన్ని(25 kg rice) అందించి ఇంటికి బాధితులను పంపించాలన్నారు.

ప్రత్యేక అధికారులు జిల్లా కలెక్టర్ సూచనలతో జనరేటర్లు అవసరమైన చోట ఏర్పాటు చేసుకొని వాటికి అవస రమైన డీజిల్ను కూడా సరఫరా చేస్తామన్నారు తెలిపారు. ఎవరికి ఇబ్బంది లేకుండా సహాయక చర్యలు చేపట్టాలన్నారు జిల్లాలో నిరాశ్రయులైన వారందరికీ ఆర్థిక సహాయం అందిం చాలన్నారు. తుఫాన్ అనంతరం రోడ్ల పడిపో యిన చెట్లు తొలగిస్తూ రాకపోకలు, అదేవిధంగా నేలకోరిగిన విద్యుత్ స్తం భాలు నెలకొల్పి విద్యుత్తు సరఫరాను పునరుద్ధరించా లన్నారు.

ఈ కార్యక్రమంలో స్థానిక పార్లమెంట్ సభ్యులు జి హరీష్ మాధుర్(G Harish Madhur), స్థానిక శాసనసభ్యులు అయితా బత్తుల ఆనందరావు, ముమ్మిడివరం శాసనస భ్యులు దాట్ల సుబ్బరాజు జిల్లా ఎస్పీ రాహుల్ మీనా, జిల్లా జాయింట్ కలెక్టర్ నిశాంతి, డిఆర్ఓ కే మాధవి ఆర్ అండ్ బి ఆర్ డబ్ల్యు ఎస్, అగ్నిమాపక విపత్తుల స్పందన, పంచాయతీరాజ్ విభాగాల అధికారులు ఇంజనీర్లు పాల్గొన్నారు.

Leave a Reply