ఎంత సంపాదించామన్నది కాదు..

ఎంత సంపాదించామన్నది కాదు..

ఎంతమందికి సాయం చేశామన్నదే ముఖ్యం

రాప్తాడు, ఆంధ్రప్రభ : నేడు బంగారు కుటుంబాలుగా ఉన్నవారే రేపు మార్గదర్శకులుగా మరికొన్ని కుటుంబాలను దత్తత తీసుకొవాలని రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత ఆకాంక్షించారు. రాప్తాడు ఎంపీడీవో కార్యాలయంలో పీ4 వార్షికోత్సవంను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే పరిటాల సునీత హాజరయ్యారు. ఈ సంధర్భంగా మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పీ4 కార్యక్రమం కి ఏడాది పూర్తి అయిన శుభ సంధర్భంగా మార్గదర్శకులు బంగారు కుటుంబాలతో ఆత్మీయ సమావేశం నిర్వహించడం చాలా సంతోషంగా ఉందన్నారు.

వాళ్లతో పరస్పరం చర్చించుకునే విధంగా ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.మార్గదర్శకులను ఘనంగా సత్కారం చేశారు. వాళ్ళు చేస్తున్న సేవా కార్యక్రమాలు గురించి అందరికీ వివరించారు. ముఖ్యమంత్రి ఒక మంచి సంకల్పంతో చేపట్టిన ఈ కార్యక్రమంతో ఏడాదిలో ఎన్నో మంచి ఫలితాలు చూపించారన్నారు. సుమారుగా 10 లక్షల మందికి పైగా కుటుంబాలు దీని ద్వారా లబ్ధి పొందుతున్నారన్నారు. పీ4 కార్యక్రమం అంటే పేద కుటుంబాలకు డబ్బులు ఇవ్వడం కాదని ఆ కుటుంబాలను ఆర్థికంగా సామాజికంగా ఉన్నత స్థానానికి తీసుకురావడమే ముఖ్య ఉద్దేశం అన్నారు.

పిల్లలకి అవసరమైన చదువులు వాళ్ళ కుటుంబ స్థితిగతులు మార్చడం ఉద్యోగాలు వచ్చేలా సహకరించడం వ్యవసాయంలో సహకారం అందించడం ఇలాంటి అనేక కార్యక్రమాలు చేయవచ్చన్నారు.నేడు బంగారు కుటుంబాలుగా ఉన్నవాళ్ళు భవిష్యత్తులో రాణించి ఉన్నత శిఖరాలు చేరుకోవాలి. రాప్తాడు నియోజకవర్గంలో మరికొంతమంది ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం కావాలన్నారు. పరిటాల రవీంద్ర మెమోరియల్ ట్రస్ట్ ద్వారా సేవా కార్యక్రమాలు చేస్తున్నామని అదే విధంగా తాము సాయం చేసేటప్పుడు కొంతమంది ముందుకు వస్తున్నారని అన్నారు.

వీరంతా పీ4 కార్యక్రమంలో భాగస్వామ్యం కావాలని విజ్ఞప్తి చేశారు. తోపుడు బండ్లు పెట్టుకొని వ్యాపారం చేసుకునే మహిళలకు మార్కెట్ యార్డ్ చైర్మన్ సుధాకర్ నాయుడు సాయం చేసేందుకు ముందుకు వచ్చారని అభినందించారు. పీ4 కార్యక్రమం అన్నది ఇప్పటికిప్పుడు ఏదో మార్పు చూపించే కార్యక్రమం కాదని 2047సం కి పేదరికం లేకుండా చేయాలన్న లక్ష్యంతో సాగుతున్న యజ్ఞం అని అన్నారు.పీ4 మార్గదర్శి పాటిబండ్ల ప్రభాకర్ ఆత్మకూరు మండలం సనప గ్రామానికి చెందిన భవాని ప్రసాద్ అనే విద్యార్థికి లాప్ టాప్ ను ఎమ్మెల్యే చేతుల మీదుగా అందజేశారు.

ఈ కార్యక్రమంలో ఆత్మకూరు టిడిపి ఇన్చార్జి బాలాజీ రాప్తాడు టిడిపి ఇన్చార్జ్ ధర్మవరపు మురళి ఎంపీడీవో విజయలక్ష్మి ఆర్డీటి ఏటిఎల్ మల్లికార్జున మండల కన్వీనర్ పంపు కొండప్ప ప్రధాన కార్యదర్శి దగ్గుపాటి శ్రీనివాసులు పిఎసిఎస్ చైర్మన్ గోపాల్ నాయుడు రాప్తాడు మార్కెట్ యార్డ్ చైర్మన్ సుధాకర్ నాయుడు సర్పంచులు సాకే తిరుపాలు నరేష్ డిప్యూటీ ఎంపీడీవోలు అశోక్ బాబు అచ్యుతానంద బాబు హంపాపురం ప్రతాప్ నాయుడు మాజీ సర్పంచ్ మోహన్ రెడ్డి మహిళా అధ్యక్షురాలు రామాంజనమ్మ క్లస్టర్ ఇన్చార్జిలు సోమర నారాయణస్వామి సిసి రాము తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply