Megastar | మూవీకి అడ్డంకులా..?

Megastar | మూవీకి అడ్డంకులా..?

Megastar | బ్లాక్‌బస్టర్ తర్వాత ఎందుకు ఆలస్యం..?
వాల్తేరు వీరయ్యను మించే ప్లాన్
ప్రాజెక్ట్ ఆగిపోయిందనే ప్రచారం వెనుక నిజం
ఎట్టకేలకు లైన్ క్లియర్.. షూటింగ్ డేట్స్ ఫిక్స్

Megastar | ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : మెగాస్టార్ చిరంజీవి నటించిన మన శంకర్ వర ప్రసాద్ గారు మూవీ సంక్రాంతికి వచ్చి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో చూశాం. అయితే.. ఇంతటి సంచలన విజయం సాధించిన తర్వాత వెంటనే కొత్త సినిమాని స్టార్ట్ చేయాలి కానీ.. ఇంత వరుకు కొత్త ప్రాజెక్ట్ పట్టాలెక్కలేదు. అంతే కాకుండా.. ఈ ప్రాజెక్ట్ ఆగిపోయిందని కూడా ప్రచారం జరిగింది. అసలు ఏమైంది..? మెగాస్టార్ మూవీకి అడ్డంకులు ఏంటి..?

Megastar | వాల్తేరు వీరయ్యను మించి..

Megastar

మన శంకర్ వరప్రసాద్ గారు సినిమా తర్వాత చిరంజీవి.. డైరెక్టర్ బాబీతో సినిమా చేయాలని ఫిక్స్ అయ్యారు. చిరు, బాబీ కలసి వాల్తేరు వీరయ్య అనే సినిమా చేశారు. ఆ సినిమా బ్లాక్ బస్టర్ అయ్యింది. ఆతర్వాత మళ్లీ కలిసి సినిమా చేయాలి అనుకున్నారు. అది ఇప్పుడు సెట్ అయ్యింది. ఈసారి.. వాల్తేరు వీరయ్యను మించి ఉండేలా బాబీ కథ రెడీ చేశాడట. ఈ కథ చెప్పగానే చిరుకు బాగా నచ్చడంతో వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇది ఎప్పుడో జరిగింది. ఈపాటికే ఈ సినిమా సెట్స్ పై ఉండాలి కానీ.. ఇంత వరుకు షూటింగ్ స్టార్ట్ కాలేదు. అంతే కాకుండా.. ఈ ప్రాజెక్ట్ ఆగిపోయిందని కూడా ప్రచారం జరగడంతో అసలు ఏమైంది..? అనేది ఆసక్తిగా మారింది.

Megastar | లైన్ క్లియర్..

Megastar

ఇంతకీ విషయం ఏంటంటే.. ఈ మూవీని కెవిఎన్ నిర్మాణ సంస్థ నిర్మిస్తుంది. ఈ నిర్మాణ సంస్థే కోలీవుడ్ స్టార్ విజయ్ ఆఖరి సినిమా జన నాయగన్ మూవీని నిర్మించింది. ఈ సినిమా సంక్రాంతికి రిలీజ్ కావాలి కానీ.. సెన్సార్ కష్టాలు వలన ఇంత వరుకు విడుదల కాలేదు. అందుచేతనే.. ఈ నిర్మాణ సంస్థ చిరుతో చేయాలి అనుకున్న సినిమాని పక్కనపెట్టిందని గుసగుసలు వినిపించాయి. అయితే.. ఇప్పుడు లైన్ క్లియర్ అయ్యిందని తెలిసింది. ఏప్రిల్ 11న పూజా కార్యక్రమాలతో షూటింగ్ స్టార్ట్ చేసి.. ఏప్రిల్ 20 నుంచి రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారని సమాచారం.

Megastar

Leave a Reply