Megastar | మన శంకర్ వరప్రసాద్ గారు క్లైమాక్స్ వేరే లెవల్..

Megastar | మన శంకర్ వరప్రసాద్ గారు క్లైమాక్స్ వేరే లెవల్..
Megastar | ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : మెగాస్టార్ చిరంజీవి హీరోగా హిట్ మిషన్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన భారీ, క్రేజీ మూవీ మన శంకర వరప్రసాద్ గారు. ఇందులో విక్టరీ వెంకటేష్ కీలక పాత్ర పోషించడం విశేషం. అనిల్.. అపజయం అనేది లేకుండా వరుసగా సక్సెస్ సాధిస్తుండడంతో.. ఈ సినిమా కూడా బ్లాక్ బస్టర్ అనే టాక్ రిలీజ్ (Release) కి ముందు నుంచి గట్టిగా వినిపిస్తోంది. అయితే.. ఇప్పుడు సినిమా రిలీజ్ కి ముందే క్లైమాక్స్ కు సంబంధించిన ఓ న్యూస్ వినిపిస్తోంది.
Megastar | ఇంతకీ విషయం ఏంటంటే…
ఈ రోజు నైట్ ప్రీమియర్స్ పడబోతున్నాయి. వరల్డ్ వైడ్ గా ఈ సినిమాకు భారీ ఓపెనింగ్స్ రాబోతున్నాయి. అయితే.. ఇప్పుడు ఈ సినిమాలో వచ్చే క్లైమాక్స్ (Climax) సీక్వెన్స్ పై ఓ న్యూస్ వైరల్ అయ్యింది. నయనతార, ఆమెకు సంబంధించిన ఇతర ఫ్యామిలీ మెంబర్స్ ను విలన్స్ టార్గెట్ చేస్తారట. ఒకే చోట కాకుండా.. వేరే వేరు ప్లేస్ ల్లో ఉన్న వారిని ఒకేసారి కాపాడాల్సి వస్తుందట. అప్పుడు సడన్ గా వెంకీ ఎంట్రీ ఇస్తాడని.. చిరు, వెంకీ చెరే ప్లేస్ కి వెళ్లి నయనతార అండ్ ఫ్యామిలీని సేవ్ చేస్తారని. ఈ సీన్స్ ఆడియన్స్ ని విశేషంగా ఆకట్టుకునేలా ఉంటాయని టాక్.

Megastar | ఇటీవల ఈ సినిమా గురించి చిరంజీవి మాట్లాడుతూ..
ఈ సినిమా పూర్తి స్థాయి వినోదాత్మక చిత్రమని, ఈ మూవీ కథ తనకు బాగా నచ్చిందని చెప్పారు. వెంకీతో చేసే సీన్స్ వేరే లెవల్లో ఉంటాయని చెప్పారు. దీంతో మరింత క్రేజ్ పెరిగింది. ఈ సంక్రాంతికి వస్తున్న సినిమాల్లో పక్కా హిట్ అనే నమ్మకం ఈ సినిమాకే ఉంది. మరి.. ఈ పండగకి థియేటర్స్ లో (Theater) మన శంకర్ వరప్రసాద్ గారు.. ఏ రేంజ్ లో సందడి చేస్తారో.. ఎలాంటి రికార్డులు సెట్ చేస్తారో.. చూడాలి.

