Mega Hero | సినిమా తీస్తామని అనౌన్స్ చేసిన దర్శకులు..

Mega Hero | సినిమా తీస్తామని అనౌన్స్ చేసిన దర్శకులు..
Mega Hero | సినిమా తీస్తామని అనౌన్స్ చేసిన దర్శకులు ఎందుకు హీరో మారుస్తారు?
కిరణ్ అబ్బవరం ‘క’ సీక్వెల్ పై కన్ఫ్యూజన్
మెగా హీరో సాయిదుర్గతేజ్ తో ‘క’ దర్శకుల కొత్త సినిమా
విరూపాక్ష తర్వాత డిఫరెంట్ స్టోరీస్ వైపు తేజ్ ఫోకస్
స్పీడ్ పెంచనున్న మెగా హీరో?
Mega Hero | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : ఇండస్ట్రీలో ఒక హీరోతో సినిమా చేద్దాం అనుకుంటే.. మరో హీరోతో సెట్ అవుతుంటుంది. అయితే.. ఇది ఇప్పటి నుంచి కాదు నాటి నుంచి నేటి వరుకు జరుగుతూనే ఉంది. అలాగే ఒక హీరోతో సినిమా తీస్తామని అనౌన్స్ చేసిన దర్శకులు మాట మార్చి మరో హీరోతో సినిమా తీసిన సందర్భాలు ఉన్నాయి. దీనికి పైకి ఏం చెప్పినా.. తెర వెనుక చాలా కారణాలు ఉంటాయి. ఇదిలా ఉంటే.. కిరణ్ అబ్బవరంకు (Kiran Abbavaram) మెగా హీరో షాక్ ఇచ్చాడని ప్రచారం జరుగుతుంది. అసలు ఏం జరిగింది..?

Mega Hero | క సీక్వెల్ ఏమైంది..?
కిరణ్ అబ్బవరం వరుసగా సక్సెస్ సాధించిన తర్వాత కథల విషయంలో కాస్త తడబడ్డాడు. వరుసగా ఫ్లాపులు వచ్చాయి. ఇక కిరణ్ పని అయిపోయింది అనే కామెంట్లు వినిపిస్తున్నాయి. ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ సాధించాల్సిన టైమ్ లో క అనే సినిమా చేశాడు. ఆ సినిమాని సుజిత్ – సందీప్ అనే దర్శకద్వయం తెరకెక్కించారు. ఊహించని విధంగా వైవిధ్యమైన కథాంశంతో రూపొందిన ఆ సినిమా (Movie) బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ అయ్యింది. దీంతో క మూవీకి సీక్వెల్ తీస్తామని ప్రకటించారు. అయితే.. కిరణ్ అబ్బవరం చేస్తున్న చెన్నై లవ్ స్టోరీ వర్క్ లో బిజీగా ఉన్నాడు కానీ.. క సీక్వెల్ గురించి ఎలాంటి అప్ డేట్ ఇవ్వలేదు.

Mega Hero | తేజ్ తో క డైరెక్టర్స్ సినిమా..
ఇదిలా ఉంటే.. క మూవీ డైరెక్టర్స్ కిరణ్ అబ్బవరంతో కాకుండా.. వేరే హీరోతో సినిమా చేసేందుకు ప్లాన్ చేస్తున్నారని ప్రచారం జరిగింది. ఇదే విషయం గురించి కిరణ్ అబ్బవరంను ఇటీవల ఓ మీడియా మీట్ లో అడిగితే.. క సీక్వెల్ కు సంబంధించి ఎవరూ తనతో డిస్కష్ చేయలేదన్నాడు. ఇప్పుడు క మూవీ దర్శకద్వయం మెగా హీరో సాయిదుర్గతేజ్ తో సినిమాని అనౌన్స్ చేశారు. ఓ పోస్టర్ రిలీజ్ (Release) చేశారు. ఇది క సీక్వెల్ కాదు.. మరో డిఫరెంట్ స్టోరీతో రూపొందుతోన్న సినిమా అని తెలుస్తోంది. ఈ సినిమాని సాహూ గారపాటి నిర్మిస్తున్నారు. తేజ్ విరూపాక్ష సినిమా తర్వాత నుంచి డిఫరెంట్ స్టోరీస్ తోనే చేయాలని ఫిక్స్ అయ్యినట్టుంది. సంబరాల ఏటి గట్టు అనే సినిమా తర్వాత వైవిధ్యంగా ఉండే కథతో ఈ సినిమా చేయబోతున్నాడు. అయితే.. తేజ్ డిఫరెంట్ స్టోరీస్ తో చేయడమే కాదు.. స్పీడుగా చేయాలనే కామెంట్లు వినిపిస్తున్నాయి. మరి.. తేజ్ స్పీడు పెంచుతాడేమో చూడాలి.


