May15 | ఇద్దరిలో గెలిచేది ఎవరు..?

May15 | ఇద్దరిలో గెలిచేది ఎవరు..?

May15 | బాక్సాఫీస్ వద్ద సూర్య – సమంత పోటీ?
సామ్ సరికొత్త ప్రయత్నం ‘మా ఇంటి బంగారం’
‘కరుప్పు’లో రెండు విభిన్న పాత్రల్లో సూర్య
మే 15న క్లాష్.. ఎవరు విన్నర్?

May15 | ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : సూర్య.. ఈ మధ్య కాలంలో నటించిన సినిమాలు ఆడియన్స్ ని ఆకట్టుకోలేదు. దీంతో ఇప్పుడు సరైన సక్సెస్ కోసం తపిస్తున్నాడు. తాజాగా సూర్య కరుప్పు అనే సినిమా చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. సమంత గత కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉంది. ఇప్పుడిప్పుడే సినిమాల్లో బిజీ అవుతుంది. అయితే.. మా ఇంటి బంగారం అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. సమంతకి కూడా ఇప్పుడు సక్సెస్ చాలా ముఖ్యం. ఇప్పుడు బాక్సాఫీస్ దగ్గర సూర్య, సమంత పోటీపడబోతున్నారని కోలీవుడ్, టాలీవుడ్ లో ప్రచారం జరుగుతుంది. మరి.. నిజంగానే ఈ ఇద్దరికి పోటీ తప్పదా..?

May15 | సామ్ సరికొత్త ప్రయత్నం..

May15

సమంత, నందినీ రెడ్డి.. ఈ ఇద్దరి కాంబోలో ఓ బేబీ సినిమా రూపొందడం.. ఆ సినిమా బ్లాక్ బస్టర్ అవ్వడం తెలిసిందే. దీంతో ఇప్పుడు మళ్లీ వీరిద్దరూ కలిసి మా ఇంటి బంగారం అనే సినిమా చేయడంతో అంచనాలు మరింత పెరిగాయి. ఈ సినిమా నుంచి రిలీజ్ చేసిన టీజర్ ఇంట్రెస్టింగ్ గా ఉండడంతో ఈ మూవీ పై మరింత బజ్ క్రియేట్ అయ్యింది. నిర్మాతగా శుభం సినిమాతో సక్సెస్ సాధించిన సమంత ఇప్పుడు నటిగా మా ఇంటి బంగారం సినిమాతో సక్సెస్ సాధించి మళ్లీ బిజీ అవ్వాలి అనుకుంటుంది. అందుకనే.. ఈ సినిమాలో ఫైట్స్ కూడా చేసి సరికొత్తగా ప్రయత్నించింది. సామ్ భర్త రాజ్ స్వయంగా ఈ మూవీని పర్యవేక్షిస్తున్నారు. దీంతో ఈ ప్రాజెక్టు ఓటిటి డీల్ కూడా భారీగా దక్కిందట. తెలుగుతో పాటు తమిళ, మలయాళ భాషల్లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. మే 15న ఈ సినిమాని రిలీజ్ చేయనున్నట్టుగా ఆమధ్య ప్రకటించారు.

May15 | రెండు డిఫరెంట్ క్యారెక్టర్స్ లో సూర్య..

May15

సూర్య నటిస్తున్న కరుప్పు విషయానికి వస్తే.. ఇందులో సూర్య డ్యూయల్ రోల్ చేశాడు. లాయర్ గా, దేవుడిగా రెండు విభిన్న పాత్రల్లో కనిపిస్తాడట. ఈ సినిమాని ఆర్జే బాలాజీ తెరకెక్కించారు. కమర్షియల్ ఎలిమెంట్స్ తో రూపొందిస్తున్న ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో పూర్తయ్యింది కానీ.. ఇంత వరకు రిలీజ్ కాలేదు. తమిళనాడు ఎన్నికల తేదీ వచ్చేయడంతో.. కోలీవుడ్ లో సినిమాల రిలీజ్ డేట్స్ పై క్లారిటీ వస్తుంది. ఏప్రిల్ 23న తమిళనాడులో పోలింగ్ అని క్లారిటీ వచ్చేసింది. దీంతో ఒక్కో సినిమా తమ రిలీజ్ డేట్స్ అనౌన్స్ చేస్తున్నాయి. కరుప్పు మూవీని మే 15న రిలీజ్ చేయాలని ఫిక్స్ చేసినట్టుగా టాక్. ఇదే జరిగితే.. సమంత మా ఇంటి బంగారం, సూర్య కరుప్పు మూవీకి పోటీ తప్పదని ప్రచారం జరుగుతుంది.

May15 | వాళ్లే విన్నర్..

May15

సూర్య, సమంత.. ఇద్దరి క్రేజులు వేరు.. సినిమాల కథలు వేరు. అయితే.. ఇప్పుడు కంటెంట్ బాగున్న సినిమానే చూస్తున్నారు జనాలు. కంటెంట్ బాగున్న వాళ్లనే విన్నర్ చేస్తున్నారు. అందుచేత ఈ ఇద్దరిలో ఎవరు విజేతలుగా నిలుస్తారు అనేది ఆసక్తిగా మారింది. సూర్య, సామ్ కలిసి సికందర్ సినిమాలో జంటగా నటించారు. ఈ సినిమా డిజాస్టర్ అయ్యింది. తర్వాత 24 మూవీలో జంటగా కనిపించారు. ఇది విజయం సాధించింది. మళ్ళీ ఆతర్వాత సూర్య, సమంత కలిసి నటించలేదు. ఇప్పుడు బాక్సాఫీస్ దగ్గర పోటీపడబోతున్నారనేది ఇంట్రెస్టింగ్ గా మారింది. ఇంకా రెండు నెలల టైమ్ ఉంది కాబట్టి.. ఎవరైనా డేట్ మార్చుకుంటారా..? లేక పోటీకి సై అంటారో చూడాలి.

Leave a Reply