Massive Blaze in jakarta ఇండోనేషియాలో 22 మంది ఆహుతి

Massive Blaze in Jakarta ఇండోనేషియాలో 22 మంది ఆహుతి
15 మంది మహిళలు.. 7గురు పురుషులు
భోజన విరామంలో పెను విషాదం
(ఆంధ్రప్రభ, న్యూస్ నెట్ వర్క్)
ఇండోనేషియా రాజధాని జకర్తాలో (Jakarta) .. అనూహ్య అగ్ని ప్రమాదంలో 22 మంది ప్రాణాలు వదిలారు. మంగళవారం మధ్యాహ్నం విరామ సమయంలో.. ఓ కంపెనీ ఉద్యోగులు భోజనానికి (Lunch Time) సిద్ధమవుతున్న క్షణాల్లో.. ఓ బ్యాటరీ (Battery Exploission) పేలింది. అగ్నికీలలు వ్యాపించాయి.
Massive Blaze in Jakarta

ఏడంతస్థుల భవనంలో ( 7 Floors Building) జరిగిన ఘోర ప్రమాదంతో.. ఆ భవనంలోని జనం ప్రాణభీతితో అల్లాడి పోయారు. ఈ దుర్ఘటనలో 15 మంది మహిళలు.. 7గురు పురుషులు ఉన్నారు. 19 మంది గాయపడగా ఆసుపత్రికి తరలించారు.
ఈ భవనంలో చిక్కుకున్న జనాన్ని గుర్తించడానికి అగ్నిమాపక సిబ్బంది ప్రయత్నాలు చేస్తున్నారు. మొదటి అంతస్తులో ( ( 1st floor) మధ్యాహ్నం సమయంలో చెలరేగిన మంటలు త్వరగా (Massive Blaze ) భవనం అంతటా వ్యాపించాయని సెంట్రల్ జకార్తా పోలీసు చీఫ్ సుసాత్యో పూర్నోమో కాండ్రో (police chief Susatyo Purnomo Condro తెలిపారు. భవనంలో నివసించే టెర్రా డ్రోన్ ఇండోనేషియా కంపెనీలో ఉద్యోగులు భోజన విరామంలో ఉన్నప్పుడు (Turn Dealy Fire) మంటలు చెలరేగాయి,
Massive Blaze in Jakarta

మరికొందరు బయటకు వచ్చారు. మృతదేహాలను వెలికితీసి తూర్పు జకార్తాలోని పోలీసు ఆసుపత్రికి తరలించారు. బాధితుల్లో ఎక్కువ మంది (Heavy Smoke) పొగ పీల్చడం వల్లే మరణించారని అధికారులు తెలిపారు. అగ్నిమాపక సిబ్బంది కనీసం 19 మంది చిక్కుకున్న కార్మికులను రక్షించారు,
వారిలో చాలామంది శ్వాస తీసుకోవడంలో షాక్ కు గురయ్యారు. స్వల్ప గాయాలతో బాధపడుతున్నారు. పొగను పీల్చిన తర్వాత ఒక పోలీసు అధికారి, ఒక అగ్నిమాపక ఉద్యోగి కూడా అస్వస్థతకు గురయ్యారు.
సీసీ ఫుటేజీలో (CC Puttage) పై అంతస్తుల నుంచి మంటల వ్యాప్తిని చూశారు. , అగ్నిమాపక సిబ్బంది అత్యవసర నిచ్చెనను ఉపయోగించి ఆరవ అంతస్తు నుంచి 12 మంది పైగా కార్మికులను ఒక్కొక్కరిగా దించారు. పొగ కమ్ముకుంటున్న సమయంలో తమ వంతు కోసం వేచి ఉండగా చాలామంది ఊపిరి పీల్చుకోవడానికి ఇబ్బంది పడ్డారు.
Massive Blaze in Jakarta

ప్రస్తుతం ఈ దుర్ఘటనపై దర్యాప్తు చేపట్టారు.
‘టెర్రా డ్రోన్ (Terra Drone ) ఇండోనేషియా’ అనే సంస్థకు చెందింది. ఈ సంస్థ మైనింగ్, వ్యవసాయ రంగాలలో ఏరియల్ సర్వే (Areal Survey) కోసం డ్రోన్ లను తయారు చేస్తుంది.
అగ్గి రాజుకుంది .. ఇలా కెమయోరన్‌లోని (Kamayoran) భవనం తొలి అంతస్తులో మధ్యాహ్నం సమయంలో మంటలు ప్రారంభమై క్షణాల్లో వ్యాపించాయి, ఆకాశంలోకి దట్టమైన నల్లటి పొగ (Black Smoke) ఆవరించింది, సమీపంలోని జనం కార్యాలయ ఉద్యోగులు ప్రాణభయంతో అల్లాడిపోయారు. . మంటలను అదుపులోకి తీసుకురావడానికి వందలాది మంది సిబ్బంది 29 అగ్నిమాపక 29 Vehicles) వాహనాలను మోహరించాయి.
Massive Blaze in Jakarta

మూడు గంటల పాటు తీవ్రంగా మంటలతో పోరాడి పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. ఈ భవనంలో పిటి టెర్రా డ్రోన్ కంపెనీ ఉంది. మంటలు చెలరేగినప్పుడు చాలా మంది కార్మికులు భోజనానికి బయటకు వెళ్ళారు, కానీ మంటలు వ్యాపించడంతో మరికొందరు చిక్కుకున్నారు. నిల్వ పరీక్షా ప్రాంతంలో డ్రోన్ బ్యాటరీ పేలి మంటలు చెలరేగినట్టు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.
“డ్రోన్ బ్యాటరీలో Battery Short Circuit) షార్ట్ సర్క్యూట్ లేదా థర్మల్ వైఫల్యంతో పేలుడు జరిగినట్టు అనుమానిస్తున్నారు” అని దిమిత్రి అనే ప్రాణాలతో బయటపడిన వ్యక్తి తెలిపాడు. కొంతమంది సహోద్యోగులు సహాయం కోసం పిలుస్తూ పైకప్పుపైకి పారిపోవడానికి ప్రయత్నించారని అతడు తెలిపాడు.
ALSO READ : Nightmare in Goa : Palms క్లబ్ విస్ఫోటనం
