Editorial | బీజేపీకి మమత తీవ్ర హెచ్చరిక

Editorial | బీజేపీకి మమత తీవ్ర హెచ్చరిక

బీజేపీ తనతో రాజకీయంగా పోరాడలేదనీ, తన ను ఓడించడం ఆ పార్టీకి సాధ్యం కాదని తృణమూల్‌ కాంగ్రెస్‌ అధ్యక్షురాలు, పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ స్పష్టం చేశారు. బెంగాల్‌లో తనకు సవా ల్‌ విసరాలని చూస్తే దేశవ్యాప్తంగా ఆపార్టీ పునాదులను పెకలిస్తానని ఆమె హెచ్చరించారు.

రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక ముమ్మర సవరణ(ఎస్‌ఐఆర్‌)కి వ్యతి రేకంగా బన్‌గావ్‌లో జరిగిన సభలో ఆమె ప్రసంగిస్తూ స్వతంత్రంగా పనిచేయాల్సిన ఎన్నికల కమిషన్‌ బీజేపీ కమిషన్‌గా మారిపోయిందని ఆరోపించారు.ఇటీవల బీహార్‌లో ఎన్నికల కమిషన్‌ సహకారంతోనే బీజేపీ అక్కడ విజయం సాధించిందని ఆమెఆరోపించారు.

ఎస్‌ఐఆర్‌ కారణంగానే బీహార్‌లో బీజేపీ విజయం సాధించింద నీ, ఇంత దారుణంగా ఓటర్ల పేర్లను జాబీ తాల నుంచి ఎన్నికల కమిషన్‌ తొలగిస్తుందని ప్రతి పక్షాలు అంచనా వేయలేకపోయాయని ఆమె అన్నా రు. పశ్చిమ బెంగాల్‌లో ఎన్నికల కమిషన్‌ ఆటలు సాగ బోవని ఆమె హెచ్చరించారు.

బంగ్లాదేశీయులను తొల గించడమే ఈ ప్రక్రియ లక్ష్యమైతే, బీజేపీ పాలిత రాష్ట్రా లలో కూడా తొలగిస్తున్నారుగా అంటే ఆ రాష్ట్రాల్లో బంగ్లాదేశీయులు ఉన్నట్టు కేంద్రం అంగీకరిస్తోందా? అని ఆమెప్రశ్నించారు. ఎన్నికల కమిషన్‌ కేంద్రం చేతి లో కీలుబొమ్మలా మారిందని ఆమె ఆరోపించారు.

బీహార్‌ కన్నా ముందు హర్యానా, మహారాష్ట్రలలో కూ డా పెద్ద ఎత్తున ఓటర్లపేర్లు తొలగంచారని ఆమె ఆరో పించారు. తాను బన్‌గావ్‌కి హెలికాప్టర్‌ ద్వారా చేరుకో వాలని అనుకున్నానని,చివరి క్షణంలో సాంకేతిక సమ స్యల వల్ల హెలికాప్టర్‌కు అడుగడుగునా కేంద్రం అవ రోధాలు సృష్టిస్తోందని ఆమె ఆరోపించారు.

బెంగాల్‌లో బీజేపీ కార్యకర్తలు అల్లర్లకు దిగి శాంతిభద్రతల సమ స్యలను సృష్టిస్తున్నారనీ,రాష్ట్రంలో సాంతిని నెలకొల్ప డానకి తమ ప్రభుత్వం కఠినంగా వ్యవహరించగలదని ఆమె హెచ్చరించారు. కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా తరచుగా బెంగాల్‌లో పర్యటించడంలో ఆంతర్యమే మిటని ఆమె ప్రశ్నించారు.

మతవిద్వేషాలను రెచ్చగొట్ట డానికి ఆయన ప్రయత్నిస్తున్నారని కూడా ఆరోపిం చారు. బీజేపీ నాయకులు ఎంత కవ్వించినా తాను, తన పార్టీ నాయకులు సహనాన్ని ప్రదర్శిస్తున్నట్టు ఆమె తెలిపారు. బెంగాల్‌లో బీజేపీ నాయకులు ఇప్పటికే అనే క విధాలుగా బెంగాల్‌కి నష్టాన్ని కలిగించే రీతిలో కేంద్రంపై ఒత్తిడి తెస్తున్నా రనీ, రాష్ట్రానికి రావల్సిన పరిశ్రమలు ఇతర రాష్ట్రాలకు తరలించుకుని పోయేం దుకు కుట్ర జరుగుతోందని ఆమె ఆరోపించారు.

ముసాయిదా ఎన్నికల జాబితాను ప్రకటించిన తర్వాత రాష్ట్రంలో భయంకరమైన పరిస్థితి ఏర్పడగలదని ఆమె హెచ్చరించారు. ఎస్‌ఐఆర్‌ను తమ పార్టీ మొదటి నుం చి వ్యతిరేకిస్తున్నదని ఆమె తెలి పారు. బెంగాల్‌ ప్రజలు తెలివైన వారు. వారిని మభ్యపెట్టాలని చూస్తే బెడిసి కొడుతుందని మమత హెచ్చరించారు.

ఎస్‌ఐఆర్‌ లో పే ర్లను తొలగించడానికి, తమకు ఇష్టమైన వారి పేర్లను జొనిపించడానికి అధికారులపై కేంద్రం ఒత్తిడి తెస్తోం దనీ, ఆ ఒత్తిడిని తట్టుకోలేక కొందరు బ్లాక్‌ స్థాయి అధి కారులు ఆత్మహత్యలు చేసుకున్నట్టు ఆమె ఆరోపిం చారు. బెంగాల్‌లో ప్రభుత్వం పటిష్టంగా ఉంది. దానిని పడగొట్టాలంటే అక్రమాలకు పాల్పడటం ఒక్కటే మార్గం.

ఇది బెడిసి కొడుతుందని కేంద్రానికి తెలుసు. అయినా సరే ఎలాగో అలా సమస్యలను సృష్టించేం దుకు బీజేపీ కంకణం కట్టుకుందని మమత ఆరోపించారు. కేంద్ర ఎన్నికల సంఘం ఎస్‌ఐఆర్‌ కోసం ఎందుకు తొందర పడుతోందో అందరికీ తెలుసునని ఆమె అన్నారు. ఆమె ఆరోపణల్లో అసత్యం లేదు. దేశంలో ఇప్పుుడు బీజేపీని తీవ్రంగా అడ్డుకుంటున్నది పార్టీ తృణమూల్‌ మాత్ర మే. ఆ పార్టీని ఓడిస్తే ఇక తమకు తిరుగులేదని కమల నాథులు భావిస్తున్నారు. కాంగ్రెస్‌కి సరై న, పటిష్టమైన నాయకత్వం లేనందువల్ల ఆ పార్టీని ఓడించడం సులభమేనని కమలనాథులు భావిస్తున్నారు. విదేశీ యుల ప్రవేశం వల్ల బీజేపీ కూడా ప్రయోజనం పొందింది.

రాజస్థాన్‌, గుజరాత్‌లలో అక్రమంగా ప్రవేశించిన వారి ఓట్లతో బీజేపీ ప్రయోజనం పొందుతోంది. తృణ మూల్‌ కాంగ్రెస్‌ అనుమానాలను తీర్చేందుకు శుక్ర వారం నాడు ఢిల్లిలోని ఎన్నికల కమిషన్‌ భవన్‌లో బెంగాల్‌కి చెందిన ఎంపీలు, సీనియర్‌ నాయకుల సమావేశాన్ని ఎన్నికలకమిషన్‌ ఏర్పాటు చేసింది. దీనిపై తృణమూల్‌ నాయకుడు వ్యాఖ్యానిస్తూ ఇది ఒక తంతు మాత్రమేనని అన్నారు. బెంగాల్‌లో సవరించిన ఓటర్ల జాబితా ఇప్పటికే సిద్థమైందని అన్నారు. ముసాయిదా జాబితావెల్లడైన తర్వాత తమ పార్టీ ప్రతి స్పందన తీ వ్రంగా ఉంటుందని ఆయన అన్నారు. మొత్తం మీద ఎస్‌ఐఆర్‌పై కేంద్రంతో తాడోపేడే తేల్చుకునేందుకు తృణ మూల్‌ సిద్థమవుతోందని స్పష్టం అవుతోంది.

Leave a Reply