Makthal | మాజీ ఎమ్మెల్యే సమక్షంలో బీఆర్ఎస్‌లో చేరికలు

Makthal | మాజీ ఎమ్మెల్యే సమక్షంలో బీఆర్ఎస్‌లో చేరికలు
Makthal | మక్తల్, ఆంధ్రప్రభ : నారాయణ పేట జిల్లా మక్తల్ మున్సిపాలిటీ పరిధిలోని 6వ వార్డుకు చెందిన ఎరుకలి శివరాజ్ ఆధ్వర్యంలో చందాపురం గ్రామం వివిధ పార్టీలకు చెందిన 20 మంది కార్యకర్తలు ఈ రోజు స్థానిక మాజీ శాసనసభ్యుడు చిట్టెం రామ్మోహన్ రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు .ఈ సందర్భంగా బీఆర్ఎస్ లో చేరిన వారికి మాజీ ఎమ్మెల్యే చిట్టెం గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… మక్తల్ మున్సిపాలిటీలో ఈసారి గులాబీ జెండాను ఎగరవేయాలని అన్ని వర్గాల ప్రజలు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులకు మద్దతుగా నిలవాలని కోరారు.
ఇచ్చిన మాట తప్పిన కాంగ్రెస్ పార్టీకి బుద్ధి రావాలంటే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ఓడించాలని ఆయన పిలుపునిచ్చారు. మక్తల్ మున్సిపాలిటీని తీసుకువచ్చిన చరిత్ర బీఆర్ ఎస్ పార్టీకి దక్కుతుందని పార్టీకి ప్రజలు ఆదరణ ఇచ్చి పార్టీ అభ్యర్థులను గెలిపించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ పి. నరసింహ గౌడ్, పట్టణ అధ్యక్షుడు చిన్న హన్మంతు, ప్రధాన కార్యదర్శి సందాపురం అశోక్ కుమార్ గౌడ్, నాయకులు తీర్మాలపూర్ కృష్ణ యాదవ్, సిరిపే రాములు, ఆంజనేయులు గౌడ్, కుర్మన్నయాదవ్, దొడ్డి రామలింగం, సిరిపే మోనేష్, దొడ్డి గోవిందు, నాగరాజు, వాబీ, బాబు, నర్సింహా, ఎరుకలి ఉసేనప్ప తదితరులు పాల్గొన్నారు.
