Mahabubnagar | స‌మ‌స్య‌లు సృష్టించ‌డం స‌రికాదు…

Mahabubnagar | స‌మ‌స్య‌లు సృష్టించ‌డం స‌రికాదు…

Mahabubnagar | ఊట్కూర్, ఆంధ్రప్రభ : నారాయణపేటజిల్లా ఊట్కూర్ మండల కేంద్రంలో కొంతమంది నాయకులు తమ స్వార్ధ రాజకీయాల కోసం క్రీడామైదానం పనులు అడ్డుకోవడం సరైంది కాదని ఊట్కూర్ మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు కోరం మహేష్ రెడ్డి(Koram Mahesh Reddy) అన్నారు.

ఈ రోజు ఊట్కూర్ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. మంత్రి డాక్టర్ వాకిటి శ్రీహరి క్రీడాభివృద్ధిని ప్రోత్సహించాలనే లక్ష్యంతో మూడు ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని జిల్లా కలెక్టర్ ఆర్డిఓ తాసిల్దారులతో కలిసి పరిశీలించగా అఖిలపక్షం నాయకులు క్రీడా మైదానానికి(Sports Ground) సహకరిస్తామని మంత్రి వెళ్ళిన తర్వాత కొంతమంది నాయకులు క్రీడామైదానం పనులు అడ్డుకోవడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు. క్రీడా మైదానం పనుల్లో హిందూ ముస్లింల మధ్య సమస్య సృష్టించడం సరి కాదన్నారు.

ఊట్కూర్(Ootkur) మండల కేంద్రంలో గత పాలకుల నిర్లక్ష్యం క్రీడా మైదానం ఏర్పాటుకు నోచుకోలేదని మంత్రి స్వయంగా క్రీడామైదానం కోసం మూడు ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని కేటాయించాలని అధికారులను ఆదేశిస్తే పనులు నిలిపివేయడంలో ఆంతర్యమేమిటని ప్రశ్నించారు. ప్రభుత్వానికి ,మంత్రికి మంచి పేరు వస్తుందని రాజకీయ కుట్రతో పరోక్షంగా పనులు అడ్డుకుంటున్నారని ఆరోపించారు. ఊట్కూర్ మండల కేంద్రంలో క్రీడా మైదానానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు.

Leave a Reply