Machilipatnam | బ్యాంక్ వద్ద ఆందోళన

Machilipatnam | మచిలీపట్నం, ఆంధ్రప్రభ : తమ కోర్కెల సాధన కోసం చేస్తున్న ఉద్యమంలో భాగంగా ఛలో మచిలీపట్నం పిలుపు మేరకు బందరు కేడీసీసీ బ్యాంక్ వద్ద ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ఉద్యోగులు సోమవారం ఆందోళన నిర్వహించారు. తమ న్యాయమైన సమస్యల పరిష్కారం కోసం చేపట్టనున్న ధర్నాలు, నిరసన కార్యక్రమాలు కొనసాగుతాయని, తమ డిమాండ్లను తక్షణమే ప్రభుత్వం పరిష్కరించాలని జేఏసీ నేతలు కోరుతున్నారు. ప్రధానంగా జీవోనెంబర్ 36 ను వెంటనే అమలుపరిచి 2019, 2024 తాలుకా పెండింగ్లో ఉన్న వేతన సవరణలు చేసి, అప్పటి వరకు మధ్యంతర భృతి ఇవ్వాలని, ఉద్యోగులకు చెల్లించే గ్రాట్యుటీ సిలింగ్ విధించి 2 లక్షలు మాత్రమే చెల్లిస్తున్నారని చెప్పారు.

గ్రాట్యుటీ చట్టాన్ని అమలుపరిచి చట్ట ప్రకారం గ్రాట్యుటీ చెల్లింపు చేయాలని, సహకార సంఘాలలో పని చేసే ఉద్యోగులకు కూడా ప్రభుత్వ ఉద్యోగు లకు అమలు అయ్యే రిటైర్మెంట్ వయస్సు 62 సంవత్సరాలకు అమలుపరచాలని, ఉద్యోగులకు 5 లక్షలకు తక్కువ కాకుండా ఆరోగ్యభీమా కల్పించి, ఉద్యోగి సర్వీస్లోలో మరణిస్తే.. ఆ కుటుంబం ఆధారం లేకుండా పోతున్నందున ప్రతీ ఉద్యోగికి 20 లక్షలు టర్మ్ ఇన్సూరెన్స్ పాలన చేయించి కుటుంబాలకు భరోసా కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. ఉద్యోగుల డ్యూటు పద్దులను రద్దు చేయాలని, 2019 తర్వాత సంఘాలలో చేరిన ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు.

Leave a Reply