Key Decisions | ముగ్గురు ఐపీఎస్ అధికారులపై బదిలీ వేటు

Key Decisions | ముగ్గురు ఐపీఎస్ అధికారులపై బదిలీ వేటు

Key Decisions | ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్‌ : పశ్చిమ బెంగాల్ లో భారీ విజయం తర్వాత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన బీజేపీ సంచలన నిర్ణయాలు తీసుకుంటుంది. ఆర్‌జీ కర్ వైద్య కళాశాల అత్యాచారం, హత్య కేసుపై కొత్త ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. ముఖ్యమంత్రి సువెందు అధికారి కేసు దర్యాప్తులో నిర్లక్ష్యం వహించిన ముగ్గురు ఐపీఎస్ అధికారులపై బదిలీ వేటు వేస్తూ సంచలన నిర్ణయం ప్రకటించారు. ఎఫ్‌ఐఆర్ నమోదు ఆలస్యం, పరిపాలనా లోపాలు, బాధితురాలి కుటుంబానికి లంచం ఇవ్వజూపారన్న ఆరోపణల నేపథ్యంలో ఈ చర్యలు తీసుకున్నట్లు తెలిపారు.

సీనియర్ ఐపీఎస్ అధికారులు వినీత్ గోయల్‌, ఇందిరా ముఖర్జీ, అభిషేక్ గుప్తాలపై ప్రభుత్వం చర్యలు తీసుకుంది. గత ప్రభుత్వ హయాంలో రక్షకులే భక్షకులుగా మారే పరిస్థితి వచ్చిందని సీఎం విమర్శించారు. నేరస్థులతో కుమ్మక్కైన అధికారులను ఉపేక్షించబోమని హెచ్చరించారు.

మరోవైపు ప్రెసిడెన్సీ జైలులో ఖైదీలు స్మార్ట్‌ఫోన్లు ఉపయోగిస్తున్నారన్న ఫిర్యాదులపై కూడా ప్రభుత్వం సీరియస్ అయింది. జైళ్ల శాఖ డీజీ ఎన్.రమేష్ బాబు నేతృత్వంలో నిర్వహించిన దాడుల్లో 23 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై జైలు సూపరింటెండెంట్ ఎన్.కుజూర్‌, చీఫ్ కంట్రోలర్ దీప్త ఘోరాయ్‌లను సస్పెండ్ చేస్తూ కేసును సీఐడీ దర్యాప్తునకు అప్పగించారు.

Leave a Reply