Liquor Scam | లిక్కర్ స్కామ్ కేసులో…

Liquor Scam | లిక్కర్ స్కామ్ కేసులో…
Liquor Scam | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ప్రధాన నిందితుడిగా ఉన్న రాజ్ కెసిరెడ్డికి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది.
గతేడాది ఏప్రిల్ 25న సిట్ అధికారులు రాజ్ కెసిరెడ్డిని అరెస్ట్ చేశారు. అప్పటి నుంచి ఆయన జ్యుడీషియల్ కస్టడీలో కొనసాగుతున్నారు. గతంలో పలుమార్లు బెయిల్ కోసం దరఖాస్తు చేసినప్పటికీ కోర్టు తిరస్కరించింది.
అయితే తాజాగా విచారణ చేపట్టిన హైకోర్టు కొన్ని నిబంధనలతో కూడిన బెయిల్‌ను మంజూరు చేసింది. దీంతో చాలా రోజుల తర్వాత ఆయనకు ఊరట లభించింది.
ఈ కేసులో రాజ్ కెసిరెడ్డిపై రాష్ట్రంలో మద్యం సరఫరా వ్యవస్థను తన ఆధీనంలోకి తీసుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి. అలాగే వివిధ డిస్టిలరీల నుంచి భారీ ఎత్తున ముడుపులు వసూలు చేయడం, ప్రైవేట్ వ్యక్తులతో కుమ్మక్కై ప్రభుత్వ ఖజానాకు నష్టం చేకూర్చినట్లు ఆరోపణలు నమోదయ్యాయి. ఈ కేసులో తదుపరి విచారణ కొనసాగనుంది.
