ఆదిలాబాద్ డీసీసీ ఉపాధ్యక్షులుగా లింగంపల్లి చంద్రయ్య..

ఆదిలాబాద్ డీసీసీ ఉపాధ్యక్షులుగా లింగంపల్లి చంద్రయ్య..

ఉట్నూర్, ఆంధ్రప్రభ : ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు మండలం దంతన్ పల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకులు, కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షులు లింగంపల్లి చంద్రయ్యకు ఆదిలాబాద్ డీసీసీ జిల్లా ఉపాధ్యక్షులుగా నియమిస్తూ.. టీపీసీసీ రాష్ట్ర అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ఆదేశాలు జారీ చేశారు. ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బోజ్జు పటేల్ తో సన్నిహితంగా ఉంటూ.. పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొని పార్టీకి చేసిన ఉత్తమ సేవలను గుర్తించి.. జిల్లా ఉపాధ్యక్షులుగా నియమించినందుకు ఉట్నూర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ఈ సందర్భంగా ఆదిలాబాద్ డీసీసీ జిల్లా ఉపాధ్యక్షులుగా నియామకమైన లింగంపల్లి చంద్రయ్య మాట్లాడుతూ.. తన పై నమ్మకంతో డీసీసీలో చోటు కల్పించినందుకు పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, ఖానాపూర్ ఎమ్మెల్యే బొజ్జో పటేల్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఎమ్మెల్యే ప్రోత్సాహం సూచనలతో పార్టీని బలోపేతం చేసేందుకు కృషి చేస్తానని ఆయన పేర్కొన్నారు.

Leave a Reply