Leopard-Captured : చిరుత పట్టివేత Andhra Prabha Top News

Leopard-Captured : చిరుత పట్టివేత Andhra Prabha Top News
- ఎస్వీ వర్సిటీలో కలకలం
- తిరుపతిలో సంచలనం
- డిప్యూటీ సీఎం ఆరా
(తిరుపతి రూరల్ , ఆంధ్రప్రభ ):
Leopard-Captured : తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర పశు వైద్య విశ్వవిద్యాలయంలో కొన్ని రోజులుగా విద్యార్థులను భయభ్రాంతులకు గురిచేస్తూ.. అటవీ శాఖ అధికారులను ముప్పుతిప్పలు పెట్టిన చిరుత పులి ని ఎట్టకేలకు అటవీ శాఖ అధికారులు బంధించారు సోమవారం ఉదయం మెడిసిన్ విభాగం సముదాయంలోని భవనంలోనికి చిరుత పులి ప్రవేశించింది. రాజ్యలక్ష్మి అనే ఉద్యోగి ఉదయం 9 .00 గంటలకు తాళాలు తీసి లోనికి వెళ్లే ప్రయత్నం చేసింది, ఎదురుగా చిరుతపులిని చూసి భయభ్రాంతులకు గురై తలుపులు మూసివేసి గడి పెట్టింది ఈ విషయాన్ని వర్సిటీ ఉన్నతాధికారులు పమాచారం ఇచ్చింది వెంటనే స్పందించిన అధికారులు అటవీ శాఖ అధికారులు సమాచారం అందించారు ఘటన స్థలానికి చేరుకున్న అటవీశాఖ అధికారులు మత్తుమందు ఇచ్చి చిరుతను బంధించి ఎస్వి జూ కు తరలించారు ఈ ఘటనతో విద్యార్థులు అధికారులు ఊపిరి పీల్చుకున్నారు
Leopard-Captured : డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆరా
తిరుపతి శ్రీ వెంకటేశ్వర పశు వైద్య విశ్వవిద్యాలయంలో చిరుత సంచారం ఘటనపై రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి , అటవీ పర్యావరణ శాఖల మంత్రి పవన్ కళ్యాణ్ ఆరా తీశారు. ప్రస్తుతం చిరుత ఎక్కడ ఉంది? పట్టుకోవడానికి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు అనే అంశాలపై అటవీ శాఖ ఉన్నతాధికారులతో రాజమండ్రి నుంచి ఫోన్ లో సమీక్షించారు. చిరుత ప్రస్తుతం వినియోగంలో లేని గదిలో నక్కి ఉన్నట్టు, సిబ్బంది ఇప్పటికే ఆ ప్రదేశానికి చేరుకున్నట్టు అధికారులు తెలిపారు. నిర్దేశిత మార్గదర్శకాలకు అనుగుణంగా అప్రమత్తంగా వ్యవహరించాలని, చిరుతకు ఎలాంటి హాని కలగకుండా సురక్షితంగా పట్టుకుని తిరిగి అటవీ ప్రాంతంలో విడిచిపెట్టేందుకు తక్షణం చర్యలు చేపట్టాలని దిశానిర్దేశం చేశారు. తక్షణమే జూ సిబ్బంది సహకారం తీసుకోవాలని చెప్పారు. రెస్కూ సందర్భంగా విద్యార్థులు, విశ్వ విద్యాలయం సిబ్బందికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు
ALSO READ : Govindaraja Swamy : గోవిందా.. గోవింద Andhra Prabha Top News
