Delhi | కుంభమేళా ఎఫెక్ట్.. ఢిల్లీ రైల్వే స్టేషన్‌లో తొక్కిసలాట

ఢిల్లీ రైల్వే స్టేషన్‌లో (శనివారం) రాత్రి భారీ తొక్కిసలాట జరిగింది. మహా కుంభమేళా కోసం భారీ సంఖ్యలో ప్రజలు ఢిల్లీ రైల్వే స్టేషన్‌కు చేరుకున్నారు. దీంతో ప్లాట్‌ఫారమ్ నంబర్ 14, 15 వద్ద తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో పలువురు గాయపడ‌గా.. వారిని ఆస్పత్రికి తరలించారు.

ఈ ఘటనపై భారతీయ రైల్వే అధికారులు, ఢిల్లీ పోలీసులు అప్రమత్తమయ్యారు. ప్రస్తుతం పరిస్థితిని అదుపు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ర‌ద్దీని నియంత్రించేందుకు పత్రి ప్లాట్ ఫామ్ పై పోలీసులు మోహరించారు.

Leave a Reply