నీటి వసతి ఏర్పాటు అభినందనీయం..

నీటి వసతి ఏర్పాటు అభినందనీయం..

కిషన్ గంజ్‌లో వాటర్ ట్యాంక్ ప్రారంభించిన ఎమ్మెల్యే ధన్ పాల్

నిజామాబాద్ ప్రతినిధి, ఆంధ్రప్రభ : గ్రామీణులు, కూలీల సౌకర్యార్థం నీటి వసతి ఏర్పాటు చేయడం అభి నందనీయమని అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ గుప్తా తెలిపారు. ది కిషన్ గంజ్ మర్చంట్ అసో సియేషన్ ఆధ్వర్యంలో సోమవారం గంజ్ లో ఏర్పాటు చేసిన వాటర్ ట్యాంక్ ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మె ల్యే మాట్లాడుతూ… కిషన్గంజ్ కు జిల్లా వ్యా ప్తంగా అనేకమంది నిత్యవసర వస్తువులు కొనుగోలు చేయడానికి వస్తుంటారన్నారు.

అలాగే వ్యాపార కేంద్రా ల్లో అనేక మంది కూ లీలు పనిచేస్తుంటారని, వారందరూ సద్వి నియోగం చేసుకోవా ల న్నారు. త్వరలోనే కిషన్ గంజిలో సీసీ రోడ్డు వేయించేల ప్రణా ళికలు సిద్ధం చేస్తున్నా మన్నారు. ఇందూరు అభివృద్ధి తన లక్ష్య మన్నారు. ఈ కార్య క్రమంలో బీజేపీ కార్పొరే టర్లు బంటు ప్రీతి ప్రవీ ణ్, జ్యోతి మురళి, మ ర్చంట్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షుడు కోలా రామ్, అధ్యక్షుడు నేతి శ్రీనివాస్, ప్రధాన కార్య దర్శి అనంపల్లి చందు, కోశాధికారి వినోద్, హ మాలీ అసోసియేషన్ అధ్యక్షుడు శ్రీనివాస్ పాల్గొన్నారు.

Leave a Reply