Kerala | పీటా ఇండియా వినూత్న చర్య

Kerala | పీటా ఇండియా వినూత్న చర్య
Kerala | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : కేరళలోని త్రిశూర్ జిల్లా ఇరింజడప్పిల్లి శ్రీకృష్ణ ఆలయంలో వినూత్న పరిణామం చోటుచేసుకుంది. జంతు హింసను నివారించే లక్ష్యంతో పీటా ఇండియా రోబోటిక్ ఏనుగును బహూకరించింది.
కేరళలోని త్రిశూర్ జిల్లా ఇరింజడప్పిల్లి శ్రీకృష్ణ ఆలయానికి పీటా ఇండియా వినూత్నమైన రోబోటిక్ ఏనుగును అందించింది. ‘ఇరింజడప్పిల్లి రామన్’గా పిలవబడే ఈ యాంత్రిక ఏనుగు సుమారు 11 అడుగుల ఎత్తు, 800 కిలోల బరువు కలిగి ఉంది.
ఈ రోబోటిక్ ఏనుగు నిజమైన ఏనుగుల మాదిరిగా కళ్ళు, చెవులు, తోకను కదిలించగలదు. ఆలయ ఉత్సవాలు, పూజా కార్యక్రమాల్లో ఇది పాల్గొనేలా రూపొందించారు. జంతువులపై హింసను తగ్గించే ఉద్దేశంతో ఈ చర్య తీసుకున్నట్లు పీటా ఇండియా వెల్లడించింది. దేవాలయ ఆచారాల కోసం రోబోటిక్ ఏనుగును వినియోగిస్తున్న దేశంలోనే ఇదే మొదటి ఆలయంగా నిలవడం విశేషం.
