Kerala Grammar School | విహారయాత్రకు వెళ్లిన విద్యార్థులు….

Kerala Grammar School | విహారయాత్రకు వెళ్లిన విద్యార్థులు….

Kerala Grammar School | జైనూర్, ఆంధ్రప్రభ : కొమరం భీం అసిఫాబాద్ జిల్లా జైనూర్ మండల కేంద్రంలోని కేరళ గ్రామర్ పాఠశాల(Kerala Grammar School) విద్యార్థులు ఈ రోజు విహార యాత్రకు వెళ్లారు. ఒకటవ తరగతి నుండి ఐదవ తరగతి వరకు విద్యార్థులు ఆదిలాబాద్ సమీపంలోని గులాబ్ సింగ్ ఫిలిం సిటీ(Gulab Singh Film City)కి వెళ్ళగా ఈ రోజు హయ్యర్ సెక్షన్ విద్యార్థులు విహార యాత్ర కోసం నిజామాబాద్ లోని సుభాష్ గార్డెన్(Subhash Garden) కి వెళ్లారు.

Kerala Grammar School |

ఈ ఎడ్యుకేషనల్ టూర్ లో విద్యార్థులకు నూతన అంశాలపై అవగాహన కలిగించడంతోపాటు విద్యార్థులు చాలా ఉత్సాహంగా, ఉల్లాసంగా గడిపారని పాఠశాల కరస్పాండెంట్ షేక్ జమీల్ తెలిపారు. ఆటపాటలతో పాటు వనభోజనాలు నిర్వహించారని, విద్యార్థులకు మెరుగైన విద్యుత్ తో పాటు వారి ఉత్సాహం ఉల్లాసం కోసం విహార యాత్రకు తీసుకు వెళ్లినట్లు ఆయన తెలిపారు.

Kerala Grammar School |

ఈ కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ షేక్ జమీల్, ప్రిన్సిపాల్ షేక్ అఖిల్, డైరెక్టర్ రిజ్వానా కౌసర్,ఎక్సలెంట్ మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ షేక్ ఇక్బాల్, ఉపాధ్యాయులు అభయ్, అబ్దుల్లా, తార, సుమయ్య, సంగీత, సుఖ దేవి, ఇందల్, వినోద్, శ్రీలత,కల్యాణి, పాఠశాల విద్యార్థులు తదితరులు పాల్గొన్నారని కరస్పాండెంట్ జమీల్ తెలిపారు.

Leave a Reply