Kaveri Travels | డ్రైవర్‌ అప్రమత్తతతో తప్పిన ప్రమాదం

Kaveri Travels | డ్రైవర్‌ అప్రమత్తతతో తప్పిన ప్రమాదం

Kaveri Travels |ఆంధ్రప్రభ బ్యూరో, ఒంగోలు : ఆంధ్రప్రదేశ్‌లో మరో బస్సు ప్రమాదం తృటిలో తప్పింది. ప్రకాశం జిల్లా రాజుపాలెం సమీపంలో కావేరి ట్రావెల్స్ బస్సు ఇంజిన్‌లో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. డ్రైవర్ అప్రమత్తంగా వ్యవహరించి వెంటనే బస్సును నిలిపివేయడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ప్రయాణికులంతా సురక్షితంగా బయటపడటంతో ఊపిరి పీల్చుకున్నారు.

హైదరాబాద్ నుంచి తిరుపతి వెళ్తున్న కావేరి ట్రావెల్స్ బస్సులో ప్రయాణిస్తుండగా ఇంజిన్ నుంచి పొగ, మంటలు రావడం డ్రైవర్ గమనించాడు. వెంటనే బస్సును రోడ్డుపక్కన ఆపడంతో ప్రయాణికులు అప్రమత్తమై కిందకు దిగిపోయారు. బస్సులో సుమారు 36 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం.

ఇటీవల ఏపీలో వరుసగా జరుగుతున్న బస్సు ప్రమాదాలు ఆందోళన కలిగిస్తున్నాయి. మార్చి 26న మార్కాపురం జిల్లాలో జరిగిన ప్రమాదంలో 13మంది సజీవదహనమయ్యారు. అలాగే మే 14న తూర్పుగోదావరి జిల్లా ఎర్నగూడెం వద్ద జరిగిన మరో ప్రమాదంలో ఒకరు మృతిచెందగా, 16 మంది గాయపడ్డారు. తాజా ఘటనతో ప్రయాణికుల్లో మరోసారి భయాందోళనలు నెలకొన్నాయి.

ప్రకాశం జిల్లా ఉలవపాడు – చాగోలు మధ్య శుక్రవారం తెల్లవారుజామున భారీ ప్రమాదం తప్పింది. హైదరాబాద్ నుండి తిరుపతి వెళ్తున్న కావేరి ట్రావెల్స్ బస్సుకు ఉదయం సుమారు 3:30 గంటల సమయంలో అగ్నిప్రమాదం సంభవించింది.

ఈ ఘటనను గమనించిన SEPL పెట్రోలింగ్ సిబ్బంది, రూట్ పెట్రోలింగ్ ఆఫీసర్ మికెల్ మనోజ్,డ్రైవర్ సాయి వెంటనే అప్రమత్తమై బస్సులో ఉన్న ప్రయాణికులను బయటకు తీసుకువచ్చారు. వారి సమయస్ఫూర్తితో సుమారు 38 మంది ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు.

సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది మరియు పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఇదిలా ఉండగా ఈ సంఘటనలతో బస్సులో ప్రయాణిస్తున్న ప్రయాణికులు ఒక్కసారిగా ఆందోళన చెందారు. ఎలాంటి ప్రమాదం జరగపోవడంతో బస్సులో ప్రయాణిస్తున్న ప్రయాణికులతో పాటు జిల్లా యంత్రాంగం ఊపిరి పీల్చుకుంది.

ఇటీవల మార్కాపురం వద్ద బస్సు ప్రమాదం జరిగి 12 మంది ప్రయాణికులు మృత్యువాత పడ్డారు. ఆ సంఘటన జరగకముందే బస్సు ప్రమాదం జరిగినప్పటికీ ప్రయాణికులు సురక్షితంగా బయటపడటం జరిగింది. ఏదేమైనప్పటికీ రవాణా శాఖ అధికారులు ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల పై ప్రత్యేక దృష్టి చెకింగ్ లు తరచూ నిర్వహించాలని ప్రయాణికులు ముక్తకంఠంతో డిమాండ్ చేస్తున్నారు.

Leave a Reply