అనంత‌గిరిలో కార్తీక‌శోభ‌

పూజ‌లు.. వ‌న భోజ‌నాలు

ఉమ్మ‌డి రంగారెడ్డి బ్యూరో, ఆంధ్ర‌ప్ర‌భ : కార్తీక‌మాసంలో ఆల‌యాల‌కు ద‌గ్గ‌ర‌లో ఉన్న తోట‌ల్లో వ‌న‌భోజ‌నాలు నిర్వ‌హించ‌డం ఆన‌వాయితీ. హైద‌రాబాద్(Hyderabad) మ‌హాన‌గ‌ర వాసులు అనంత‌గిరి ప్రాంతాల్లో పిక్నిక్‌(Picnic)లు నిర్వ‌హ‌ణ‌కు వెళుతుంటారు. హైదరాబాద్ కి 70 కిలో మీటర్ల దూరంలో ఉన్న శ్రీ అనంతపద్మనాభస్వామి ఆలయం స‌మీపాన ఉన్న తోట్ల‌లో వ‌న‌భోజ‌నాల(Wild Food)ను ఈ రోజు ఏర్పాటు చేసుకున్నారు.

కుటుంబ‌స‌భ్యుల‌తోపాటు, స్నేహితులు, బంధువులు కలిసి వెళ్ల‌డంతో అనంత‌గిరి ప్రాంత‌మంత‌టా సంద‌డిగా మారింది. ఉదయం ఆక్కడికి వెళ్ళి వంటలు చేసుకుని చెట్ల కింద కూర్చొని భోజనాలు చేశారు. సాయంత్రం అక్కడి నుంచి బయలు దేరి తమ తమ ఇళ్లకు చేరుకున్నారు. కొన్ని సామాజిక వ‌ర్గాల వారీగా(social class wise) వ‌న భోజ‌నాల కార్య‌క్ర‌మం నిర్వ‌హించారు. ముంద‌స్తుగా సోషల్ మీడియా, వారి వారి సంఘాల గ్రూపుల్లో మెసేజ్ లు పెట్టుకొని వ‌న భోజ‌నాలు ఏర్పాటు చేసుకుంటున్నారు.

Leave a Reply