Kadem | విద్యార్థులు క్రీడల్లో రాణించాలి..

Kadem | కడెం (నిర్మల్ జిల్లా) ఆంధ్రప్రభ : విద్యార్థులు క్రీడల్లో రాణించాలని కడెం ఎంపీడీఓ జె సునీత అన్నారు. ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న రెండవ ఎడిషన్ సీఎం కప్ పోటీలను క్లస్టర్ లింగాపూర్ పరిధిలో గల కడెం మండలంలోని లింగాపూర్ జెడ్‌పీఎస్ ఎస్‌ పాఠశాల మైదానంలో ఈ రోజు కబడ్డీ, కోకో పోటీలు కడెం ఎంపీడీవో జే సునీత ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కడెం మండల విద్యాశాఖ అధికారి షేక్ హుస్సేన్, స్థానిక జెడ్పీ హైస్కూల్ హెచ్ ఎం బీ. వెంకటరమణ, పీడీ ప్రభాకర్, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Leave a Reply