ఎట్టకేలకు బాధ్యతలు స్వీకరించిన జన్నారం ఎస్సై

జన్నారం, ఆంధ్రప్రభ : జన్నారం నూతన ఎస్సైగా గుర్రం ఉదయ్ కిరణ్ శనివారం మధ్యాహ్నం బాధ్యతలు స్వీకరించారు.గతంలో ఇక్కడ పనిచేసిన ఎస్సై గొల్లపల్లి అనూషను సీపీ గత నెల 8న బదిలీ చేశారు.ఆమె తర్వాత ఇంతకాలం జన్నారం ఇన్చార్జి ఎస్ఐగా దండేపల్లి ఎస్సై తహసోద్దీన్ పని చేశారు. ఎట్టకేలకు కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని పట్టణ ఎస్ఐగా పనిచేసిన ఉదయ్ కిరణ్ ను జన్నారంకు రామగుండం సీపీ అంబర్ కిషోర్ ఝా బదిలీ చేశారు.ఈ మేరకు బాధ్యతలు స్వీకరించిన నూతన ఎస్సైని స్థానిక ఏఎస్ఐ ఉమేష్ కుమార్,హెడ్ కానిస్టేబుళ్లు ఎం.డి గౌస్,బి.తుకారాం, దత్తు,గోవింద్ నాయక్, కానిస్టేబుళ్లు సంతోష్ నాయక్,వెంకటేష్, తదితరులు మొక్క అందజేసి స్వాగతం పలికారు.

Leave a Reply