IRGC | కంటైనర్ నౌకపై దాడి

IRGC | కంటైనర్ నౌకపై దాడి

IRGC | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క : హర్మూజ్ జలసంధిలో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కంటైనర్ నౌకపై ఇరాన్ విప్లవ గార్డులు కాల్పులు జరిపిన ఘటన అంతర్జాతీయంగా ఆందోళన కలిగిస్తోంది.

హర్మూజ్ జలసంధిలో ప్రయాణిస్తున్న ఓ కంటైనర్ నౌకపై ఇరాన్‌కు చెందిన IRGC (ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్) కాల్పులు జరిపినట్లు బ్రిటన్ మిలిటరీకి చెందిన యునైటెడ్ కింగ్‌డమ్ మారిటైమ్ ట్రేడ్ ఆపరేషన్స్ సెంటర్ వెల్లడించింది. ఈ ఘటనలో నౌకకు నష్టం వాటిల్లినట్లు సమాచారం.

అయితే ఈ కాల్పుల్లో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు స్పష్టం చేశారు. ఈ పరిణామం హర్మూజ్ జలసంధిలో ఉద్రిక్తతలను మరింత పెంచుతోంది.

హర్మూజ్ ప్రాంతాన్ని అమెరికా నేవీ దిగ్బంధించడం ఈ ఘటనకు కారణంగా భావిస్తున్నారు. ఇదిలా ఉండగా, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రెండోసారి కాల్పుల విరమణకు పిలుపునిచ్చినప్పటికీ పరిస్థితుల్లో పెద్దగా మార్పు కనిపించకపోవడం గమనార్హం.

Leave a Reply