International | మహిళా శక్తితోనే స్వర్ణిమ భారత్ సాధ్యం:

International | మహిళా శక్తితోనే స్వర్ణిమ భారత్ సాధ్యం:

ఎన్టీఆర్ టీడీపీ అధ్యక్షురాలుగద్దె అనురాధ..

International | పటమట, ఆంధ్రప్రభ : మహిళా శక్తి ప్రాధాన్యతతోనే స్వర్ణిమ భారత్ నిర్మాణం సాధ్యమని ఎన్టీఆర్ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షురాలు గద్దె అనురాధ అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని బ్రహ్మకుమారీస్ పటమట సేవా కేంద్రంలో ఆదివారం వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన గద్దె అనురాధ మహిళల సాధికారత, వారి పాత్రపై ప్రసంగించారు. ఈ సందర్భంగా గద్దె అనురాధ మాట్లాడుతూ ప్రతి మహిళకు పురుషుడు వెన్నుదన్నుగా నిలవాలని అన్నారు.

సమాజంలో ప్రతి స్త్రీని గౌరవంతో చూడటం ప్రతి పురుషుడి బాధ్యత అని తెలిపారు. ప్రతి పురుషుడు తనకు జన్మనిచ్చే తల్లి మూర్తిగా ప్రతి స్త్రీని భావించి గౌరవించాలని సూచించారు. “మాతృత్వం” అనే గొప్ప గుణంతో స్త్రీ సమాజ నిర్మాణంలో కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు. మహిళలను గౌరవించే సమాజమే నిజమైన అభివృద్ధి సాధించగలదని అన్నారు. విశ్వశాంతి నవనిర్మాణం సాధించేందుకు పురుషులు తమ బాధ్యతగా భావించి మహిళలకు సహకరించాలని ఆమె పిలుపునిచ్చారు. మహిళల సాధికారతతోనే కుటుంబం, సమాజం, దేశం మరింత బలపడుతుందని తెలిపారు.

International |
International |

నలంద విద్యాసంస్థల సహాయకురాలు ఎ. సుధారాణి మాట్లాడుతూ ప్రపంచ శాంతి సాధనలో బ్రహ్మకుమారీస్ సంస్థ కీలక పాత్ర పోషిస్తోందని అన్నారు. శివశక్తుల మార్గదర్శకత్వంలో సంస్థ నిరంతరం సేవలు అందిస్తోందని కొనియాడారు. బ్రహ్మకుమారీస్ పటమట శాఖ నిర్వాహకులు రాజయోగిని, రాధాలు మాట్లాడుతూ సృష్టి పరివర్తన, స్వర్ణిమ ప్రపంచ స్థాపన కోసం పరమపిత శివ పరమాత్మ ఈ భూమిపై అవతరించి మహిళలలో దాగి ఉన్న ప్రేమ, సహనం, ధైర్యం వంటి గుణాలను వెలికి తీస్తున్నారని వివరించారు.

International |
International |

1936 నుంచే మహిళలకు జ్ఞాన కలశాన్ని అప్పగించి విశ్వవ్యాప్తంగా బ్రహ్మకుమారీస్ సంస్థలను నడిపిస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో బ్రహ్మకుమారీస్ సభ్యులు రాజయోగిని, కృష్ణవేణి, శేషకుమారి, నాగలక్ష్మి, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

International |
International |

CLICK HERE TO READ MORE : Asia Cup | మహిళా ప్రత్యేకం క్రీడా ఉత్సాహం..

CLICK HERE TO READ MORE :

Leave a Reply