Intermediate | సూత్రాలు పాటించండి విజయం సాధించండి..

Intermediate | సూత్రాలు పాటించండి విజయం సాధించండి..

పరీక్షల్లో విజయానికి ఉత్తమ సూచనలు.
విద్యా నిపుణుల సూచన

Intermediate | నంద్యాల బ్యూరో, ఆంధ్రప్రభ : పరీక్షలు కాలం సమీపించింది. ఇప్పటికే ఇంటర్మీడియట్ మొదటి రెండవ సంవత్సరం పబ్లిక్ పరీక్షల్లో సగానికి పైగా పూర్తి అయ్యాయి. ఈనెల 16వ తేదీన సోమవారం నుంచి పదవ తరగతి పబ్లిక్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. పరీక్షల్లో ఏడాదంతా చదివి మూడు గంటల్లో పరీక్ష రాయడం అంటే ఒక గొప్ప మానసిక సంఘర్షణకు గురికావలసిన విషయమే. ఒక విద్యార్థి సంవత్సరం పొడవునా చదివిన జ్ఞానాన్ని పరీక్షల సమయంలో కొన్ని గంటల్లోనే సమర్థంగా వ్యక్తపరచాలి. అందువల్ల పరీక్షల్లో విజయాన్ని సాధించాలంటే కేవలం చదువు మాత్రమే కాదు.

సరైన ప్రణాళిక,సమయపాలన, మానసిక ప్రశాంతత, ఆత్మవిశ్వాసం కూడా చాలా ముఖ్యమైనవి అని మానసిక శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. విద్యా నిపుణులు సూచిస్తున్న ముఖ్యమైన సూచనలు విద్యార్థులకు ఎంతో ఉపయోగపడతాయని వీటిని పాటించేందుకు విద్యార్థుల తల్లిదండ్రులు వచ్చేయాల్సిన అవసరం ఉందని విద్యా నిపుణులు పేర్కొంటున్నారు. ఏడాది ఎంత చదివిన విద్యార్థి పరీక్షల ముందు రివిజన్ అత్యంత ముఖ్యంగా చూసుకోవాల్సిన అవసరం ఉంది.పరీక్షలకు ముందు రోజుల్లో ముఖ్యమైన పాఠాలు, ముఖ్యాంశాలు, సూత్రాలు, నిర్వచనాలు తప్పనిసరిగా రివిజన్ మననం చేసుకోవాలి.

Intermediate |

ముఖ్యమైన ప్రశ్నలు, చిన్న నోట్స్, ముఖ్యాంశాలను ఒకసారి పునశ్చరణ చేయడం వల్ల పరీక్షలో త్వరగా గుర్తుకు వస్తాయి. చివరి రోజుల్లో కొత్త పాఠాలు మొదలు పెట్టకూడదు ప్రారంభించకూడదు. పరీక్షకు ముందు రోజు కొత్త పాఠాలు మొదలుపెట్టడం వల్ల గందరగోళం ఏర్పడుతుంది. ఇప్పటికే చదివిన విషయాలను సంక్షిప్తంగా గుర్తు చేసుకోవడం ఉత్తమంగా విద్యార్థులు భావించాల్సి ఉంటుంది. ప్రతి తల్లిదండ్రులు విద్యార్థులలో పరీక్షలు కాలంలో జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. పరీక్షల ముందు తగినంత నిద్ర తీసుకోవాలి. ఆందోళన చెందకూడదు.

Intermediate |


Intermediate | పరీక్షకు ముందు సిద్ధం కావాల్సిన వస్తువులు

రాత్రంతా మేలుకొని చదవడం వల్ల మరుసటి రోజు అలసట, ఏకాగ్రత లోపం ఏర్పడుతుంది. చదివినది మరిచిపోయే పరిస్థితి వస్తుంది. పరీక్షకు ముందు సిద్ధం కావాల్సిన వస్తువులు జాగ్రత్తగా తీసుకువెళ్లాలి. పరీక్షకు వెళ్లే ముందు ప్రతి విద్యార్థి ఎన్నో వస్తువులు సిద్ధంగా ఉంచుకోవాలి. పెన్లు, పెన్సిల్, స్కేల్, హాల్ టికెట్ అవసరమైతే కాల్కులేటర్, జ్యామెట్రీ బాక్స్ వంటి వాటిని ప్రతిరోజూ తీసుకు వెళ్లాల్సిన అవసరం ఉంటుంది. పరీక్షా హాల్లో ప్రతి విద్యార్థి మనశ్శాంతిగా ప్రశాంతంగా ఉండి ప్రశ్నాపత్రం పూర్తిగా చదవలి. ప్రశ్నాపత్రం అందుకున్న వెంటనే తొందరపడకుండా ఒకసారి మొత్తం ప్రశ్నలు చదవాలి.

ప్రశ్నల అర్థం సరిగ్గా తెలుసుకోవడం చాలా ముఖ్యం గా భావించాల్సి ఉంటుంది. ప్రశ్నపత్రంలో బాగా చదివిన తర్వాత బాగా తెలిసిన ప్రశ్నలతో ప్రారంభించలి. మొదట సులభమైన, బాగా తెలిసిన ప్రశ్నలు రాయడం ప్రారంభించలి.దీని వల్ల ప్రతి విద్యార్థిలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ప్రతి ప్రశ్నకు సరైన సమయం కేటాయించాలి.ఒకే ప్రశ్నపై ఎక్కువ సమయం వృథా చేయకూడదు. సమయం మూడు గంటలే కాబట్టి సమయాన్నికూలంగా ప్రశ్నలకు జవాబులు రాసుకుంటూ వెళ్ళాలి.

ఆలోచించటానికి టైం ఉండదు. ఇచ్చిన ప్రతి ప్రశ్నలకు సమాధానాలు స్పష్టంగా రాయలి.సమాధానాలను స్పష్టంగా, శుభ్రంగా, పాయింట్లుగా రాయాలి. అప్పుడు జవాబు పత్రాలు ది ద్దే వారు మార్కులు కరెక్టుగా వేస్తారు. అవసరమైతే హెడింగ్స్, సబ్ హెడింగ్స్ వాడాలి. వాటికి స్కెచ్ పెన్నులతో గీతలు పెట్టాలి. జవాబు పత్రాలు ఆకర్షణీయంగా రాయడం కూడా ముఖ్యంగా ఉండాలి. ముఖ్యమైన పదాలను అండర్‌లైన్ చేయాలి.అవసరమైతే డయాగ్రామ్స్, చార్ట్స్, మ్యాప్స్ ఉపయోగించాలి. పరీక్ష ముగిసే ముందు తప్పనిసరిగా చేయాల్సినవి కూడ ప్రతి విద్యార్థి గమనించాల్సిన అంశాలను కచ్చితంగా పాటించాలి.

చివరలో కనీసం 5నుంచి 10 నిమిషాలు సమాధాన పత్రాన్ని పరిశీలించాలి. ప్రశ్న సంఖ్యలు సరైనవా? అని చూడాలి. ఏదైనా ప్రశ్న మిస్ అయ్యిందా? అని చెక్ చేసుకోవాలి.చిన్న చిన్న తప్పులు ఉంటే వెంటనే సరిచేయాలి. పరీక్షల సమయంలో మానసిక స్థైర్యం ఎలా ఉండాలి.. పరీక్షలు అనేవి భయపడాల్సినవి కావు. భయం, ఆందోళన వల్ల చదివిన విషయాలు కూడా గుర్తుకు రావు. కాబట్టి ఆందోళన చెందకూడదు టెన్షన్కు పోకూడదు. కాబట్టి పరీక్ష సమయంలో శాంతంగా, ధైర్యంగా, ఆత్మవిశ్వాసంతో ఉండాలి. లోతుగా శ్వాస తీసుకోవడం ప్రశాంతంగా ఆలోచించడం సానుకూలంగా ఉండటం వంటి అంశాలను ర్తుంచుకోవాలి.

ఇవి పరీక్షల్లో మంచి ఫలితాలకు సహాయపడతాయని విద్యా నిపుణులు భావిస్తున్నారు. ప్రతి విద్యార్థి సంవత్సర కాలంలో చదివి మూడు గంటల్లో పరీక్ష రాసి తిన్నత సాధించాలని ప్రతి ఒక్కరూ ఆశీస్సులు చేద్దాం. విజయానికి గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు. సంవత్సరం పొడవునా చేసిన కృషి వృథా కాదు. పరీక్షలను ఒక అవకాశం గా భావించాలి. శాంతంగా, సమయపాలనతో రాస్తే మంచి ఫలితాలు ఖచ్చితంగా వస్తాయని విద్యా నిపుణులు భావిస్తున్నారు.

CLICK HERE TO READ MORE : తెలంగాణ ట్రిపుల్ ఐటీ ప్రవేశాలకు నోటిఫికేషన్ షెడ్యూల్ విడుదల

CLICK HERE TO READ MORE :

Leave a Reply