TG | ఎల్లుండి.. ఎల్ఎల్బీసీ టన్నెల్ వద్దకు బీఆర్ఎస్ బృందం

హైదరాబాద్ : సహాయ కార్యక్రమాలకు ఆటంకం కలిగించకూడదనే ఉద్దేశంతో తాము ఇంతవరకూ ఎస్ఎల్బీసీ టన్నెల్ కూలిన ప్రాంతానికి వెళ్లలేదని చెప్పారు బీఆర్ఎస్ మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు. ఈ నేపథ్యంలోనే అక్కడి పరిస్థితులను తెలుసుకోవడం కోసం తమ పార్టీ బృందం గురువారం ఆ ప్రాంతానికి వెళ్లనున్నట్లు తెలిపారు. తమ పర్యటన బృందానికి ఎటువంటి ఆటంకాలు కలిగించవద్దని పోలీసులను కోరారు. తాము శాంతియుత పద్దతుల్లోనే అక్కడికి వెళ్లి అధికారుల నుంచి అక్కడ పనిచేసే సిబ్బంది నుంచి వివరాలు సేకరించేందుకే వెళ్తున్నామని చెప్పారు. ఇది రాజకీయ పర్యటన కాదని, ఈ విషయాన్ని గమనించి అక్కడ ఉన్న అందరూ తమకు సహకరించాలని విజ్నప్తి చేశారు…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *