Indrakeeladri | అమ్మవారి సేవలో పునరంకితం..

Indrakeeladri | అమ్మవారి సేవలో పునరంకితం..

  • ఆలయంలో స్వచ్ఛంద సేవలు..
  • భక్తుల సౌకర్యమే లక్ష్యంగా అహర్నిశలు సేవలు..
  • ప్రశంసలు అందుకుంటున్న వాలంటీర్లు..
  • అన్నప్రసాదం నుంచి దర్శనం వరకూ విశేషసేవలో

Indrakeeladri | ఇంద్రకీలాద్రి, ఆంధ్రప్రభ : వారంతా స్వచ్ఛంద సేవకులు… అమ్మవారిని భక్తిశ్రద్ధలతో కొలుస్తూ ఆలయానికి వచ్చే భక్తుల సేవలలో పునర్కితమవుతున్నారు. విజయవాడ ఇంద్రకీలాద్రి(Indrakeeladri)పై కొలువై ఉన్న శ్రీ దుర్గా మల్లేశ్వరస్వామి వార్ల దేవస్థానంలో భక్తుల సౌకర్యార్థం స్వచ్ఛంద సేవకులు అందిస్తున్న సేవలు ప్రశంసల వర్షం కురిపిస్తున్నాయి.

దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చే లక్షలాది మంది భక్తులకు మెరుగైన సౌకర్యాలు అందించడంలో వాలంటీర్లు అహర్నిశలు అంకితభావంతో పనిచేస్తుండటం ఆలయ ప్రతిష్టను మరింత పెంచుతోంది. ఆలయ ప్రాంగణంలోని అన్నప్రసాద భవనం, క్యూ లైన్లు, లిఫ్ట్ సౌకర్యాలు, అంతరాలయం, ఆన్‌లైన్ సేవా కౌంటర్లు వంటి కీలక విభాగాల్లో స్వచ్ఛంద సేవకులు చూపిస్తున్న చొరవ భక్తులకు భరోసానిస్తూ ప్రశాంత వాతావరణాన్ని కల్పిస్తోంది. ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండా, కేవలం అమ్మవారి సేవే పరమావధిగా భావిస్తూ వాలంటీర్లు నిర్వర్తిస్తున్న విధులు భక్తుల హృదయాలను ఆకట్టుకుంటున్నాయి.

Indrakeeladri |

Indrakeeladri |అన్నప్రసాద వితరణలో క్రమబద్ధీకరిస్తూ..

ప్రతిరోజూ వేలాది మంది భక్తులకు నిర్వహిస్తున్న అన్నప్రసాద వితరణలో స్వచ్ఛంద సేవకులు క్రమశిక్షణ(discipline)తో, శుభ్రతకు అత్యంత ప్రాధాన్యం ఇస్తూ సేవలందిస్తున్నారు. ఎక్కడా గందరగోళం తలెత్తకుండా భక్తులను వరుసగా కూర్చోబెట్టి అన్నప్రసాదం అందించడం, వయోవృద్ధులు, మహిళలు, పిల్లల పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపించడం ప్రశంసనీయంగా మారింది. భక్తుల నుంచి అభిప్రాయాలు, సూచనలు సేకరించి దేవస్థానం దృష్టికి తీసుకువెళ్లడంలోనూ సేవకులు కీలక పాత్ర పోషిస్తున్నారు.

Indrakeeladri |

Indrakeeladri |క్యూ లైన్లు, లిఫ్ట్ సౌకర్యాలోను..

సాధారణ దర్శన క్యూ లైన్లతో పాటు వయోవృద్ధులు, వికలాంగుల కోసం ఏర్పాటు చేసిన లిఫ్ట్ సౌకర్యం(lift facility) వద్ద స్వచ్ఛంద సేవకులు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. భక్తుల రద్దీని నియంత్రిస్తూ, వారికి సరైన మార్గనిర్దేశం చేస్తూ, దర్శనం ప్రశాంతంగా జరిగేలా కృషి చేస్తున్నారు. ఎండ, వర్షం వంటి పరిస్థితుల్లోనూ భక్తులకు తాగునీరు, అవసరమైన సహాయం అందిస్తూ మానవత్వాన్ని చాటుతున్నారు.

Indrakeeladri |

Indrakeeladri |అంతరాలయం, దర్శన ప్రదేశాల్లో…

ప్రధాన ఆలయ అంతరాలయం, వివిధ దర్శన మండపాల్లో భక్తులు క్రమబద్ధంగా దర్శనం చేసుకునేలా సేవకులు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. ఎక్కడా తొక్కిసలాట వంటి పరిస్థితులు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపడుతూ, భక్తులకు భద్రతాభావం కలిగిస్తున్నారు. భక్తులు ప్రశాంతంగా అమ్మవారి దర్శనం చేసుకుని తిరిగి వెళ్లేలా వాలంటీర్ల సేవలు కీలకంగా నిలుస్తున్నాయి.

Indrakeeladri |

Indrakeeladri |ఆన్‌లైన్ సేవలకు తోడ్పాటు..

టిక్కెట్లు, ప్రసాదాల బుకింగ్, ఇతర ఆన్‌లైన్(online) సేవలకు సంబంధించి భక్తులకు అవసరమైన సమాచారం అందిస్తూ, సేవలు త్వరితగతిన అందేలా స్వచ్ఛంద సేవకులు సహకరిస్తున్నారు. సాంకేతిక పరిజ్ఞానం తక్కువగా ఉన్న భక్తులకు సహాయహస్తం అందిస్తూ దేవస్థానం సేవలను సులభతరం చేస్తున్నారు.

Indrakeeladri |వాలంటీర్లకు సౌకర్యాలు…

అమ్మవారి ఆలయంలో స్వచ్ఛందంగా సేవలు అందిస్తున్న వాలంటీర్లకు దేవస్థానం అధికారులు అన్ని సౌకర్యాలను కల్పిస్తోంది. ఈ సందర్భంగా దేవస్థానం కార్యనిర్వహణాధికారి వి.కె.శీనానాయక్ మాట్లాడుతూ… అమ్మవారి సేవలో పాల్గొనాలనే ఉద్దేశ్యం ఉన్న భక్తులు దేవస్థానం వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్(registration) చేసుకుని, మార్గదర్శకాలకు అనుగుణంగా సేవలందించాలని కోరారు.

స్వచ్ఛంద సేవకుల సౌకర్యార్థం సీవీ రెడ్డి చారిటీస్‌లో వసతి, అక్కడి నుంచి దేవస్థానానికి రవాణా సదుపాయం, భోజన ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. ఇంద్రకీలాద్రిపై స్వచ్ఛంద సేవలను మరింత విస్తృతంగా వినియోగించుకునేందుకు భవిష్యత్తులో మరిన్ని మెరుగైన చర్యలు చేపడతామని ఆయన వెల్లడించారు. స్వచ్ఛంద సేవకుల అంకితభావం వల్లే కనకదుర్గమ్మ ఆలయం భక్తులకు ఆదర్శంగా నిలుస్తోందని అధికారులు పేర్కొన్నారు.

CLICK TO HERE TEAD MORE : Puranapanda Srinivas | నేనున్నాను అఖండ గ్రంథం అద్బుతం..

CLICK TO HERE TEAD MORE :

Leave a Reply