నేడు భార‌త్‌, ఓమ‌న్ మ‌ధ్య పోరు

ఆంధ్ర‌ప్ర‌భ వెబ్ డెస్క్ : ఆసియా కప్ (Asia Cup) 2025లో భార‌త్ చివ‌రి లీగ్ మ్యాచ్ (League Match) శుక్ర‌వారం ( సెప్టెంబ‌ర్ 19న‌) ఓమ‌న్ జ‌ట్టుతో ఆడేందుకు సిద్ధ‌మైంది. ఇప్ప‌టికే సూపర్ 4 రౌండ్‌లో భారత్ స్థానం సంపాదించుకుంది. మొదట యూఏఈ (UAE)ని, ఆ తర్వాత పాకిస్థాన్ (Pakistan)ను ఓడించిన టీమిండియా తదుపరి రౌండ్‌లోకి ప్రవేశించింది. ఓమన్‌తో మ్యాచ్ కేవలం ప్రాక్టీస్‌గా ఉప‌యోగించుకోవాల‌ని టీమిండియా భావిస్తోంది. ఇందుకోసం జ‌ట్టులో మూడు మార్పులు చేయాల‌ని చూస్తున్న‌ట్లు స‌మాచారం.

టీమిండియా తదుపరి మ్యాచ్ అబుదాబి (Abu Dhabi)లో జరుగుతుంది. ఎడమచేతి వాటం బ్యాట్స్‌మన్ రింకూ సింగ్ (Rinku Singh) ఆసియా కప్‌లో అరంగేట్రం చేయవచ్చు. రింకు సింగ్ యూపీ ప్రీమియర్ లీగ్‌లో కొన్ని అద్భుతమైన ఇన్నింగ్స్‌లు ఆడి జట్టును ఫైనల్‌కు తీసుకెళ్లాడు. రింకుతో పాటు హర్షిత్ రాణా, అర్ష్‌దీప్ సింగ్ కూడా అవ‌కాశం క‌ల్పించ‌నున్న‌ట్లు తెలుస్తోంది.. ఈ ఇద్దరు ఆటగాళ్ళు ఆడితే, హార్దిక్ పాండ్యా, జస్‌ప్రీత్ బుమ్రాలకు తదుపరి మ్యాచ్‌కు విశ్రాంతి ఇవ్వవచ్చు. సూపర్ ఫోర్స్‌కు ముందు జస్‌ప్రీత్ బుమ్రా (Jasprit Bumrah), హార్దిక్ పాండ్యాలకు విశ్రాంతి ఇవ్వాలని టీమిండియా పరిశీలిస్తోంది. జట్టులో ఖచ్చితమైన మార్పు ఉంది. అబుదాబి స్టేడియంలో టీమిండియా ఒకే ఒక్క టీ20 మ్యాచ్ ఆడింది. 2021 టీ20 ప్రపంచ కప్ లో అఫ్గానిస్తాన్ తో టీం ఇండియా (Team India) తలపడింది. ఆ మ్యాచ్ లో టీం ఇండియా 66 పరుగుల తేడాతో గెలిచింది.

టీమిండియా జ‌ట్టు అంచ‌నా : శుభమన్ గిల్, అభిషేక్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, సంజు శాంసన్, తిలక్ వర్మ/రింకు సింగ్, శివమ్ దూబే, హర్షిత్ రాణా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, అర్ష్‌దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి

Leave a Reply