- ఆఖర్లో పాండ్యా మెరుపులు
- కివీస్ టార్గెట్ ఎంతంటే !
ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా నేడు జరుగుతున్న ఆఖరి లీగ్ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేపట్టిన టీమిండియా.. న్యూజిలాండ్ ముందు డిఫెండబుల్ టార్గెట్ సెట్ చేసింది. అయితే, ఆదిలోనే 30 పరుగులకు 3 వికెట్లు కోల్పయి కష్టాల్లో పడ్డ రోహిత్ సేన.. అనూహ్యంగా పుంజుకుని స్కోర్ బోర్డుపై 249/9 పరుగులు నమోదు చేసింది.
ఓపెనర్ గిల్ (2), కెప్టెన్ రోహిత్ శర్మ (15), విరాట్ కోహ్లీ (11) పెవిలియన్ చేరుకోగా…. ఈ క్రమంలో క్రీజులోకి వచ్చిన శ్రేయాస్ అయ్యర్ (98 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్ 79) హాఫ్ సెంచరీతో చెలరేగాడు.
అక్షర్ పటేల్ (61 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్ 42), కేఎల్ రాహుల్ (29 బంతుల్లో 1 ఫోర్లు, 23) లతో కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పారు శ్రేయస్.
అక్షర్ తో కలిసి 4వ వికెట్ కు 136 బంతుల్లో 98 పరుగులు జోడించిన శ్రేయస్… ఆ తరువాత కేఎల్ రాహుల్ తో కలిసి 5వ వికెట్ కు 44 పరుగుల జోడించాడు.
ఇక ఆఖర్లో రవీంద్ర జడేజా (16) పరుగులు చేసి ఔటవ్వగా… హార్ధిక్ పాండ్యా (45 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్ 45) మెరుపులు మెరిపించాడు.
ఇక కివీస్ బౌల్లలో మాట్ హెన్రీ ఐదు వికెట్లు కైవసం చేసుకోగా… కైల్ జామీసన్, విలియం ఓ’రూర్క్, మిచెల్ సాంట్నర్, రచిన్ రవీంద్ర తలా ఒక్క వికెట్ పడగొట్టారు. ఇక టీమిండియా నిర్ధేశించిన 250 పరుగుల టార్గెట్ తో న్యూజిలాండ్ ఛేజింగ్ కు దిగనుంది.