చేవెళ్ల అభివృద్ధిని విస్మరించారు

చేవెళ్ల అభివృద్ధిని విస్మరించారు

  • పట్లోళ్లకు రాజకీయ సమాధి తప్పదు

చేవెళ్ల, ఆంధ్ర్ర‌ప్ర‌భ : చేవెళ్ల అభివృద్ధిని విస్మరించిన పట్లోళ్ల కుటుంబానికి రాజకీయ సమాధి తప్పదని జడ్పీ మాజీ చైర్మన్, మాజీ ఎమ్మెల్యే కె. ఎస్.రత్నం(K. S. Ratnam) అన్నారు. ఈ రోజు బీజేపీ నేతలతో కలిసి చేవెళ్లలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డిని ఏకవచనంతో బీఆర్ఎస్ నేత కార్తీక్ రెడ్డి సంభోదించడం పట్ల మండిపడ్డారు.

జాతీయ రహదారి నిర్మాణం పై ఎంపీ కెవిఆర్ మాటలను వక్రీకరించడం పట్ల ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. వార్డు మెంబెర్ సైతం కానీ కార్తీక్‌రెడ్డి, ఎంపీ కేవీఆర్ ను విమర్శించే అర్హత లేదన్నారు. దశాబ్దాల కాలంగా చేవెళ్లను మీ కుటుంబం పరిపాలించింద‌ని, కానీ అభివృద్ధి మాత్రం చేయలేద‌ని కె.ఎస్‌.ర‌త్నం అన్నారు. నేటికీ మండలాల్లో ప్రభుత్వ జూనియర్ కళాశాలలు లేవ‌ని, ప్రాణహిత చేవెళ్ల ఏమైందంటూ ప్రశ్నించారు.

ప్రాజెక్టు మొబిలైజేషన్(Mobilization) పేరుతో రూ. 800 కోట్లు దిగమింగారని ఆరోపించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ ప్రభుత్వాలలో మంత్రిగా పనిచేసిన మీరు చేసిన అభివృద్ధి శూన్యమని చెప్పారు. పరిగి ఎమ్మెల్యే టీఆర్ఆర్ కు సిగ్గు లేదని, ఇప్ప‌టివ‌ర‌కు చేసేందేమీ లేద‌న్నారు. పూడూరులో నేవీ రాడార్, హైదరాబాద్- బీజాపూర్ జాతీయ రహదారి నిర్మాణానికి రూ. వెయ్యి కోట్లు నిధులను(Rs. A thousand crores of funds) ఎంపీ కెవిఆర్ మంజూరు చేయించారని వెల్లడించారు.

ఎమ్మెల్యే కాలే యాదయ్య ట్రిపుల్‌ వన్ జీవో ఎత్తివేయిస్తానని, చేవెళ్ల అభివృద్ధి చేయిస్తా అంటూ పార్టీలు మారార‌న్నారు. మరి జీవో ఎత్తి వేయించాడా , చేవెళ్ల అభివృద్ధి చేశారా అని ప్రశ్నించారు. అభివృద్ధికి కట్టుబడి ఉన్న ఎంపీ కెవిఆర్ ను విమర్శిస్తే సహించేది లేదన్నారు. ఈ సమావేశంలో మున్సిపల్ అధ్యక్షుడు అత్తేల్లి అనంతరెడ్డి(Attelli Anantha Reddy), ఓబీసీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, ఆంజనేయులు గౌడ్, యువ నాయకులు డాక్టర్ మల్ గారి వైభవ్ రెడ్డి, జై శంకర్, వెంకట్రామ్ రెడ్డి, అభిషేక్ రెడ్డి,అశోక్, కర్ణాకర్, సుధాకర్ రెడ్డి ప్రభాకర్ రెడ్డి, మధుకర్ రెడ్డి తదితరులు ఉన్నారు.

Leave a Reply