- జన్వాడలో డ్రోన్ ఎగురవేత
- 2020లో రేవంత్ పై కేసు నమోదు
- అప్పట్లోనే రేవంత్ రెడ్డి అరెస్ట్
- ఆ తర్వాత కేసు కొట్టివేయాలంటూ పిటిషన్
- ఫామ్ హౌజ్ నిషిద్ద ప్రదేశం కాదంటూ వాదన
- ఏకీభవించిన న్యాయ స్థానం
హైదరాబాద్ : తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై గతంలో నమోదైన కేసును హైకోర్టు కొట్టేసింది. జన్వాడలో డ్రోన్ ఎగురవేసిన ఘటనకు సంబంధించి 2020మార్చిలో నార్సింగి పీఎస్ లో ఆయనపై కేసు నమోదైంది. దీంతో రేవంత్ రెడ్డిని అప్పట్లో నార్సింగి పోలీసులు రిమాండ్ కు తరలించారు.
ఈక్రమంలో ఎఫ్ఐఆర్ ను క్వాష్ చేయాలని ఆయన తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. వాదనల సందర్భంగా జన్వాడ నిషిద్ధ ప్రాంతమేమీ కాదని రేవంత్ రెడ్డి తరఫు న్యాయవాది పేర్కొన్నారు. తప్పుడు సెక్షన్లు నమోదు చేశారని చెప్పారు. ఇరువర్గాల వాదనలు విన్న కోర్టు రేవంత్ పై నమోదైన కేసును కొట్టివేసింది.