Icon Star | బన్నీ నెక్ట్స్ మూవీ ఫిక్స్..?

Icon Star | బన్నీ నెక్ట్స్ మూవీ ఫిక్స్..?
Icon Star | ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. ప్రస్తుతం అట్లీతో భారీ పాన్ వరల్డ్ మూవీ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా తర్వాత బన్నీ నెక్ట్స్ మూవీ ఎవరితో అనేది ఆసక్తిగా మారింది. బన్నీతో సినిమా చేయడం కోసం.. టాలీవుడ్ (Tollywood) డైరెక్టర్స్ మాత్రమే కాదు.. కోలీవుడ్, బాలీవుడ్ డైరెక్టర్స్ కూడా ట్రై చేస్తున్నారు. కొత్త సంవత్సరంలో.. బన్నీ కొత్త సినిమాని ప్రకటిస్తారని వార్తలు వచ్చాయి. ఇప్పుడు.. బన్నీ నెక్ట్స్ మూవీ ఫిక్స్ అంటూ ప్రచారం జరుగుతుంది. ఇంతకీ.. బన్నీ కొత్త సినిమా ఎవరితో..? ఎప్పుడు..?
Icon Star | బన్నీ, త్రివిక్రమ్ మైథలాజికల్ స్టోరీ..
అల్లు అర్జున్.. అట్లీతో చేస్తున్న మూవీ షూటింగ్ జూన్ లేదా జులైకు కంప్లీట్ అవుతుంది. ఆతర్వాత నుంచి బన్నీ కొత్త సినిమాని పట్టాలెక్కించాలి అనుకుంటున్నాడట. అయితే.. త్రివిక్రమ్ పేరు మళ్లీ తెర పైకి వచ్చింది. మైథలాజికల్ స్టోరీతో బన్నీ, త్రివిక్రమ్ సినిమా చేయాలి అనుకున్నారు. అది ఎన్టీఆర్ దగ్గరకు వెళ్లింది. ఇప్పుడు బన్నీ మళ్లీ ఇంట్రెస్ట్ (Intrest) చూపించడంతో.. మళ్లీ ఇక్కడకు వచ్చినట్టుగా ఇండస్ట్రీలో వినిపించింది. దీని గురించి బన్నీ వాసు కూడా స్పందించడం ఆసక్తిగా మారింది. దాదాపుగా బన్నీ, త్రివిక్రమ్ కాంబో ఫిక్స్ అనేట్టుగా ప్రచారం జరిగింది కానీ.. ఇంత వరకు ఎలాంటి అప్ డేట్ లేదు..

Icon Star | బన్నీతో.. లోకేష్..
లేటెస్ట్ గా ఫిల్మ్ నగర్ లో.. ఇండస్ట్రీ సర్కిల్స్ లో.. వినిపిస్తున్న మాట ఏంటంటే.. బన్నీకి ఇటీవల లోకేష్ కనకరాజ్ ఓ సూపర్ హీరో స్టోరీ చెప్పాడట. ఆ కథ బన్నీకి బాగా నచ్చడంతో.. ఓకే చెప్పాడని.. ఈ సినిమా ఫిక్స్ అంటూ ప్రచారం జరుగుతుంది. త్వరలోనే ఈ క్రేజీ మూవీని అనౌన్స్ చేస్తారనేది ఇండస్ట్రీ ఇన్ సైడ్ న్యూస్. మరి.. షూటింగ్ (Shooting) ఎప్పటి నుంచి స్టార్ట్ చేస్తారంటే.. అక్టోబర్ నుంచి సెట్స్ పైకి వెళ్లేందుకు ప్లాన్ చేస్తున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ మూవీని ప్రముఖ నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ బ్యానర్ పై మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ భారీ స్థాయిలో నిర్మించనున్నారని టాక్ వినిపిస్తోంది. మరి.. త్వరలోనే క్లారిటీ ఇస్తారేమో చూడాలి.

