ఆంధ్రప్రభ, ఎన్టీఆర్ బ్యూరో : ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనే అత్యంత ప్రాచుర్యం పొందిన విజయవాడ(Vijayawada)లోని ఇంద్రకీలాద్రిపై ఉన్న శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో కొలువై ఉన్నకనకదుర్గమ్మ వారికి భక్తులు కానుకుల వర్షాన్నికురిపించారు.
పక్క జిల్లాలతో పాటు పలు రాష్ట్రాల నుండి దేశ విదేశాల నుండి పెద్ద ఎత్తున అమ్మవారి దర్శనానికి వస్తున్నభక్తులు కనకదుర్గమ్మ(Kanakadurgamma) వారికి బంగారం, వెండి వస్తువులతో పాటు నగదు విదేశీ కరెన్సీని కూడా విరాళంగా అందజేస్తున్నారు.
గడిచిన 31 రోజుల ఆలయంలోని అన్ని హుండీలను ఆలయ అధికారులు మహా మండపం ఆరవ అంతస్తులు గురువారం లెక్కించారు. ఆలయ కార్య నిర్వహణ అధికారి శీనా నాయక్ పర్యవేక్షణలో ఈ లెక్కింపులో భాగంగా అమ్మవారికి నగదు రూపంలో రూ 4,57,31,258, బంగారం 400 గ్రాములు, వెండి 7 కేజీల 650 గ్రాములను కానుకులను హుండీ(Hundi)లో భక్తులు సమర్పించారు.
వీటితోపాటు ఈఎస్ఏ డాలర్లు 524, ఇంగ్లాండ్ పౌండ్స్(England Pounds) 70, సింగపూర్ డాలర్లు 52, ఆస్ట్రేలియా డాలర్లు 60, అరబ్ ఎమిరేట్స్ దిరాన్స్(Arab Emirates Dirhams) 590, సౌదీ రియాస్ 28 ఉమాను బియాస్ 300 కత్తా రియాల్సు 73 మలేషియా రిగ్గిట్ రెండు యూరప్ యూరోస్ 11 కువైట్ దినార్ 6 న్యూజిలాండ్ డాలర్లు 10 హాంకాంగ్ డాలర్స్ 100 కెనడా డాలర్స్ 270 ని విదేశీ భక్తులు అమ్మవారికి కానుకల రూపంలో సమర్పించారు.
