గురుకుల విద్యార్థిని ఆత్మహత్య..

గురుకుల విద్యార్థిని ఆత్మహత్య..

చెన్నూర్, ఆంధ్రప్రభ : మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలం గంగారం గ్రామానికి చెందిన శ్రీహిందూ అనే విద్యార్థిని గడ్డి మందు సేవించి ఆత్మహత్యకు పాల్పడింది. చెన్నూరు పట్టణంలోని సోషల్ వెల్ఫేర్ గురుకుల పాఠశాలలో ఏడవ తరగతి చదువుతున్న విద్యార్థిని శ్రీహిందూ గత రెండు రోజుల క్రింద స్నేహితులతో గొడవ జరగడంతో మనస్థాపం చెంది హాస్టల్ లోనే క్రిమిసంహారక మందు సేవించింది. దీంతో సమాచారం అందుకున్న కుటుంబ సభ్యులు స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వైద్యసేవలు అందించినట్లు సమాచారం.

నాల్గు రోజులు అనంతరం మంచిర్యాల పట్టణంలోనీ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఈ రోజు విద్యార్థిని మృతి చెందింది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఏడవ తరగతి చదువుతున్న శ్రీహిందుకు గడ్డి మందు ఎలా వచ్చింది..? ఎందుకని ఈ అఘాయిత్యానికి పాల్పడింది..? ఉపాధ్యాయులు ఏమైనా మందలించారా..? అనే అంశాలు పోలీసుల దర్యాప్తులో వెల్లడయ్యే అవకాశం ఉంది. ఈ ఘటన మాత్రం స్థానికంగా కలకలం రేపింది.

Leave a Reply