మెగాస్టార్ కు అంతర్జాతీయ అవార్డు’జీవిత సాఫల్య పురస్కారం’ ప్రకటించిన బ్రిడ్జ్ ఇండియా
40 ఏళ్ల సినీరంగానికి చేసిన సేవలకు గుర్తింపుగా..
లండన్ పార్లమెంట్ లో చిరంజీవికి సత్కారం
ఈ నెల 19వ తేదిన హౌస్ ఆఫ్ కామన్స్ లోఅవార్డు ప్రదానోత్సవం
హైదరాబాద్ – ప్రముఖ సినీ నటుడు, మెగాస్టార్ చిరంజీవికి అరుదైన గౌరవం లభించింది. నాలుగు దశాబ్దాలుగా సినిమాల ద్వారా కళారంగానికి, సమాజానికి చేసిన సేవలకుగానూ, యుకె కి చెందిన అధికార లేబర్ పార్టీ పార్లమెంట్ సభ్యుడు నవేందు మిశ్రా మెగా స్టార్ చిరంజీవి ని ఈ నెల 19న సన్మానించనున్నారు. లండన్ లోని హౌస్ ఆఫ్ కామన్స్ లో జరిగే ఈ కార్యక్రమానికి సోజన్ జోసెఫ్, బాబ్ బ్లాక్ మన్ సహా ఇతర పార్లమెంట్ సభ్యులు ఈ కార్యక్రమానికి హాజరుకానున్నారు. ఇక సినిమా, ప్రజాసేవ.. దాతృత్వానికి చిరంజీవి చేసిన కృషిని గుర్తించి కల్చరల్ లీడర్షిప్ ద్వారా ప్రజాసేవలో ఎక్సలెన్స్ కోసం ‘జీవిత సాఫల్య పురస్కారం’ ప్రదానం చేయనుంది బ్రిడ్జ్ ఇండియా సంస్థ. ఈ అవార్డును అందుకునేందుకు చిరంజీవి ఈ నెల 18న లండన్ కు బయలుదేరి వెళ్లనున్నారు..