Gold rates|ఆగనిది నా అడుగు..

Gold rates|ఆగనిది నా అడుగు..

  • పైపైకి బంగారం, వెండి ధ‌ర‌లు
  • ఇవాళ స్వ‌ల్పంగా పెరిగిన రేట్లు
  • 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,62,600
  • 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,45,600
  • వెండి ధర రూ. 2,82,000

Gold rates|ఆంధ్ర‌ప్ర‌భ, వెబ్‌డెస్క్ : మీకు ఏమంటే ఇష్ట‌మ‌ని మ‌హిళ‌ను అడిగితే.. వారికి ట‌క్కున గుర్తొచ్చేది బంగార‌మే.. బంగారు ఆభ‌ర‌ణాల వేసుకోవాలంటే వారికి ఎంతో మ‌క్కువ. డ‌బ్బులుంటే చాలు బంగారం కొని పెట్టుకోవ‌డానికి ఆస‌క్తి చూపుతారు. నాకు ఇన్ని తులాల బంగారం ఉంది… నాకు ఆ న‌క్లెస్ ఉంది.. నాకు ఈ గొలుసు ఉంది అంటూ గొప్ప‌గా చెప్పుకుంటూ మురిసిపోతుంటారు. కానీ ఈ ముచ్చ‌ట నిన్న మొన్న‌టి వ‌ర‌కు ఉండేది. ఎందుకంటే ఇటీవ‌ల బంగారం ధ‌ర రికార్డు స్థాయిలో పెరిగిపోతుంది. దీంతోపాటు వెండి ధ‌ర‌లు కూడా భ‌గ్గుమంటున్నాయి. గ‌తేడాది నుంచి వీటి ధ‌ర‌లు పెర‌గ‌డ‌మే అధికంగా ఉంది. దీంతో గోల్డ్ షాపు మెట్లు ఎక్క‌డానికే భ‌య‌ప‌డాల్సిన ప‌రిస్థితి నెల‌కొంది. గత రెండు రోజులుగా తగ్గిన బంగారం ధరలు మళ్లీ పెరగడంతో కొనుగోలుదారులు ఆందోళన చెందుతున్నారు. ఈ రోజు ( సోమ‌వారం) కూడా గోల్డ్‌, సిల్వ‌ర్ ధ‌ర‌లు స్వ‌ల్పంగా పెరిగాయి.

ధ‌ర‌లు ఇలా ఉన్నాయి..
హైదరాబాద్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,62,600గా ఉంది. నిన్నటితో పోలిస్తే రూ.1,450 పెరిగింది. ఇక 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,45,600గా ఉంది. నిన్నటితో పోలిస్తే రూ.2,050 పెరిగింది. కిలో వెండి ధర రూ. 2వేలు పెరిగింది. దాని ప్ర‌స్తుత ధ‌ర రూ. 2,82,000 వద్ద కొనసాగుతోంది.

Leave a Reply