Garibi Hatao | ఆమె పరిపాలన ఎప్పటికీ ఆదర్శం..

Garibi Hatao | ఆమె పరిపాలన ఎప్పటికీ ఆదర్శం..

Garibi Hatao | హుజూర్‌నగర్, ఆంధ్రప్రభ : భారతదేశ తొలి మహిళా ప్రధాన మంత్రి ఉక్కు మహిళ ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తన్నీరు మల్లికార్జున్(Tanniru Mallikarjun) ఆధ్వర్యంలో సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్ నియోజకవర్గ కేంద్రంలో ఆమె చిత్ర పటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా తన్నీరు మల్లికార్జున్ మాట్లాడుతూ…. గరీబీ హటావో(Garibi Hatao) నినాదంతో దేశంలో పేదరిక నిర్మూలన కోసం విప్లవాత్మక సంస్కరణలు చేపట్టిన ధీర వనిత ఇందిరాగాంధీ(Dheera Vanita Indira Gandhi) అన్నారు. ఇందిరాగాంధీ పరిపాలన సంస్కరణలు ఎప్పటికీ ఆదర్శం అన్నారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు దొంగరి వెంకటేశ్వర్లు, కోతి సంపత్ రెడ్డి, జక్కుల మల్లయ్య, ఎమ్.డీ అజీజ్ పాషా, చిట్యాల అమరనాథ్ రెడ్డి, వల్లపుదాసు కృష్ణ, ఎస్కే సైదా, కుంట సైదులు, ఎడ్ల విజయ్, సులువ చందు, దగ్గుపాటి బాబురావు, బెల్లంకొండ శ్రీనివాస్, సప్పిడి సావిత్రి, ఆయిల వెంకన్న, కస్తాల వీరబాబు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply