Gandhari | ఆంద్రప్రభ పత్రికకు, ప్రజల్లో తగ్గని ఆదరణ..

Gandhari | ఆంద్రప్రభ పత్రికకు, ప్రజల్లో తగ్గని ఆదరణ..
Gandhari | గాంధారి, ఆంధ్రప్రభ : స్వాతంత్ర కాలం నుంచి నేటి వరకు ఆంధ్రప్రభ దినపత్రికకు ప్రజల్లో ఎంతో ఆదరణ ఉన్నదని గాంధారి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బండారి పరమేష్, గాంధారి సర్పంచ్ మమ్మాయి రేణుక సంజీవ్ యాదవ్ అన్నారు. గాంధారి మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆవరణలో ఆంధ్రప్రభ 2026 వార్షిక క్యాలెండర్ ను, స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… గత 88 సంవత్సరాలుగా ఆంధ్రప్రభ పత్రికా రెండు తెలుగు రాష్ట్రాల్లో నిజాలను బయటకు తీస్తూ ప్రజల పక్షాన నిలుచున్న పత్రిక అని అన్నారు. స్వాతంత్ర్య కాలం నుంచి నేటి వరకు ప్రజల సమస్యల పరిష్కారం కోసం పనిచేస్తున్న ఏకైక పత్రిక అని వారు గుర్తు చేశారు.
ఆంధ్రప్రభ దినపత్రిక ఎన్నో మానవీయ కథనాలు, అభివృద్ధికి సంబందించిన ప్రభుత్వ విధానాలను ప్రచూరిస్తూ అభివృద్ధి కోసం ప్రజల తరుఫున కృషి చేస్తుందన్నారు. ఈ సంవత్సరం కూడా ఆంధ్రప్రభ పత్రికా మంచి కథనాలు, ప్రజా సమస్యలను, అభివృద్ధి కార్యక్రమాలను వెలుగులోకి తెచ్చి మరింత మన్ననలు పొందాలన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న ప్రభుత్వ పథకాలతో పాటు ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు ప్రచురిస్తూ, ప్రజల్లోకి మరింత లోతుగా వెళ్లాలని వారు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో గాంధారి మండల ఆంధ్రప్రభ విలేకరి తాడ్వాయి సంతోష్ కుమార్, ఏఎంసి వైస్ చైర్మన్ ఆకుల లక్ష్మణ్, గాంధారి సింగిల్ విండో మాజీ చైర్మన్ పెద్దబూరి సాయికుమార్, గాంధారి విడిసి చైర్మన్ ఆకుల రామస్వామి, మాజీ ఎంపిటిసి పత్తి శ్రీనివాస్, మున్నూరు కాపు సంఘం మండల అధ్యక్షుడు ఆకుల బాలకిషన్, వార్డు సభ్యుడు లైన్ రమేష్, కమ్మరి నాగరాజు, కమ్మరి స్వామి, జింగురు హన్మడ్లు, తూర్పు రమేష్, తదితరులు ఉన్నారు.
